Aswani Dutt.. సీనియర్ ఎన్టీఆర్ ను మొదలుకొని నిన్న వచ్చిన సీతారామం సినిమా వరకు వైజయంతి మూవీస్ నుంచి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ క్రమంలోని తాజాగా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న అశ్విని దత్ మాట్లాడుతూ సీతారామం సినిమా కోసం రూ.54 కోట్లు ఖర్చు పెట్టాము.. ఆ సినిమాకు ముందు హీరోయిన్గా మృణాల్ ఠాగూర్, దర్శకుడిగా హను రాఘవపూడి నుంచి ఎటువంటి భారీ హిట్లు లేవు. పైగా మేము ఖర్చుకు వెనుకాడలేదు. ఈ సినిమా కథలో చాలా భాగం కాశ్మీర్లోనే చిత్రీకరించాము.. నెలరోజులు అక్కడే ఉన్నాము.
గుజరాత్, రష్యాలో కూడా షూట్ చేశాము. ఇంత ఖర్చు పెడుతున్నాము.. వస్తుందా? లేదా? అన్న ఆలోచన కూడా మేము చేయలేదు.. కానీ ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టింది కానీ వంద రోజులు ఆడలేదే.. ఆ ఫంక్షన్ చేయలేకపోయామే అని అనిపించింది. ఈ రోజుల్లో ఏ సినిమా రిలీజ్ అయిన కూడా ఫస్ట్ వీకెండ్ వరకు థియేటర్లో ఉంటే చాలు అనుకుంటున్నారు.. కానీ వంద రోజుల ఫంక్షన్ చేయాలనే నా కోరిక ప్రభాస్ ప్రాజెకే తో నెరవేరుతుందని భావిస్తున్నాను.. అంటూ తెలిపారు అశ్వినీ దత్.క్ట్