Kodali Nani : నిజాలు చెప్పేసిన నాని.. అడ్డంగా ఇరికించేశాడు..

Kodali Nani : గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పై సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలకు ఎంపీలకు సూచనలు సలహాలు ఇచ్చారు. అక్కడి నుంచి వచ్చిన కొడాలి నాని అక్కడ జరిగిన మీటింగ్ గురించి మాట్లాడకుండా అక్కడ కూడా వివేక హత్య కేసు గురించి మాట్లాడినట్లు.. ఆ టాపిక్ ను డైవర్ట్ చేయడం గురించి మాట్లాడినట్లు.. కొడాలి నాని మాట్లాడిన మాటలు ద్వారా స్పష్టం అవుతుందని రాజకీయ విశ్లేషకులు చర్చ చేస్తున్నారు..

వివేకానంద గారిని చంపితే జగన్మోహన్ రెడ్డికి ఏమొస్తుంది.. ఆ ఊర్లో వచ్చిన వాళ్ళందరికీ కాఫీలు, టీలు ఖర్చు తప్ప.. భోజనాల ఖర్చు తప్ప ఆయనకు ఏమొస్తుంది.. ఏమైనా ఆస్తి వచ్చిందా.. లేకపోతే ముఖ్యమంత్రి పదవి వచ్చిందా.. లేకపోతే రాష్ట్ర అధ్యక్ష పదవి ఏమైనా వచ్చిందా.. లేకపోతే వైఎస్ఆర్సిపి వివేకానంద రెడ్డి పెట్టిన పార్టీనా.. జగన్మోహన్ రెడ్డి పార్టీ పడితే వివేకానంద రెడ్డి వెళ్లి కాంగ్రెస్ పార్టీ తరపున విజయమ్మ మీద పోటీ చేశారు. ఆయన ఆశయాల మేరకు వైసిపి పార్టీ ఏమి ముందుకి నడవడం లేదు అని కొడాలి నాని అన్నారు.

వివేకానంద రెడ్డిని చంపితే జగన్మోహన్ రెడ్డికి ఏమొస్తుంది. లేదంటే జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులకు ఏమొస్తుంది. వివేకానంద రెడ్డి బ్రతికున్న చనిపోయిన ఆ సీటు అవినాష్ రెడ్డికే ఇస్తారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసి జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టి పార్లమెంటుకి అయినా విజయమ్మ పులివెందుల నుంచి పోటీ చేస్తే ఆయన మద్దతు ఇవ్వకపోగా విజయమ్మకు పోటీగా నిలిచారు.

Gudivada muncipical office in Kodali Nani photo on contraversial
Gudivada muncipical office in Kodali Nani photo on contraversial

వివేకానంద చనిపోయే నాటికి ఆయన పేరు మీద ఐదు పైసల ఆస్తి కూడా లేదు. ఆయన పేరు ఉన్నటువంటి ఆస్తి మొత్తం కూడా తన కూతురు, భార్య పేరు మీద రాసేశారు. ఎందుకని ఆయన పేరు మీద ఉన్న ఆస్తులన్నీ ట్రాన్స్ఫర్ అయ్యాయి.. ఆయన ఆస్తి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా వచ్చిందా.. వివేక నందరెడ్డి చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఏమైనా ఆస్తులుగాని, పదవులు వచ్చాయా.. ఎందుకు ఆయనని అంటున్నారు అంటూ కొడాలి నాని తనదైన శైలిలో విమర్శలు చేశారు. అయితే ఇదంతా ఒక స్ట్రాటజీ అని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.