MLA Roja : వైసిపి ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకుంది రోజా.. వైసిపి తరఫున రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రోజాకు రెండో విడతలో మంత్రి పదవిని కట్టబెట్టారు సీఎం జగన్.. అంతకుముందు వరకు నియోజకవర్గంలో సొంత పార్టీ నేతల ద్వారానే ఇబ్బంది పడ్డ రోజా మంత్రి పదవి చేపట్టిన తర్వాత ఈ విషయంలో వాటిని అధిగమించినట్లు కనిపించారు. దాంతో రోజాకు ఇక నగరిలో మరోసారి తిరుగులేదని అనిపిస్తుంది.. రోజా సీఎం జగన్ ను అన్నా అంటూ ఆప్యాయంగా పిలుస్తుంది. మరి సీఎం జగన్ రోజును ఏమని పిలుస్తారు..? ఆ పిలుపు ఆయన నోటి నుంచి వచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలవడానికి వచ్చిన పలువురు వీఐపీలు ఆయనను సన్మానిస్తూ ఉండగా.. అక్కడికి వచ్చిన రోజా ని చూసి సీఎం జగన్ వెంటనే రామ్మా రోజమ్మ తల్లి అని జగన్ పిలవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. రోజాను ఎంతో ప్రేమగా రోజమ్మ తల్లి అని జగన్ నోటి నుంచి రావడం అందరికీ ఆనందాన్ని కలిగించింది. దాంతో వైసిపి ఫ్యాన్స్ ఈ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. జగన్ ఎంతో ఆప్యాయంగా తన ఎమ్మెల్యేలను గౌరవిస్తారు అంటూ.. సోషల్ మీడియాలో ఈ వీడియోను వైరల్ చేసే పనిలో పడ్డారు రోజా ఫ్యాన్స్..
రోజా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేను మంత్రి పదవి కోసం ఎప్పుడు ఆశపడలేదు. మంత్రి పదవి కావాలని కూడా కోరుకోలేదు.. జగనన్న ముఖ్యమంత్రి అయితే చాలు మేమంతా ముఖ్యమంత్రులం అయినట్టే అని భావించాం. జగన్ గారి మనసులో నాకు ఎప్పుడు స్థానం ఉంటుంది. ఆయన నన్ను చెల్లెలుగా అభిమానిస్తారు. అది చాలు నాకు..
అసెంబ్లీ సాక్షిగా అందరూ ముందు రోజమ్మ నా చెల్లి.. ఏ తప్పు చేయలేదు అంటూ జగనన్న చెప్పేసరికి నా నోట నుంచి మాట రాలేదు. ఆ మాటలకు నేను జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటాను అంటూ భావోద్వేగంగా మాట్లాడారు నగరి ఎమ్మెల్యే రోజా.. ఇటీవల ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనసులోని మాటలను తమ అభిమానులతో పంచుకున్నారు రోజా. అలాగే తన రాజకీయ జీవితం గురించి సీఎం గురించి చాలా ఆసక్తికర విషయాలను చెప్పారు.