Girl Twist : కడుపునొప్పితో ఆస్పత్రికెళ్లిన బాలిక.. స్కాన్ చేసిన డాక్టర్లకు ట్విస్ట్ !

Girl Twist : ఓ బాలిక తీవ్రమైన కడుపునొప్పితో హాస్పిటల్లో చేరింది.. ఆమెను స్కాన్ చేసిన డాక్టర్లు ఇచ్చిన రిపోర్టులు చూసి దెబ్బకు కంగుతిన్నారు. ఈ సంఘటన కృష్ణాజిల్లా గుడివాడలోని శ్రీరామ నర్సింగ్ హోమ్ లో చోటుచేసుకుంది.. ఆ వివరాలు ఓసారి చూద్దాం..

14 ఏళ్ల బాలిక అన్నం తినడం లేదని.. తరచూ వాంతులు చేసుకుంటుందని.. రోజు రోజుకి సన్నగా అయిపోతుందని.. 15 రోజుల క్రితం ఆమెను నర్సింగ్ హోమ్ కు తీసుకువెళ్లారు. డాక్టర్ పొట్లూరి వంశీకృష్ణ పలు టెస్టులు చేసిన తర్వాత ఆమెకు జుట్టు తినే అలవాటు ఉందని గుర్తించి ఎండొస్కోపీ చేయించారు. కడుపులో కణితి మాదిరిగా జుట్టు పేరుకుపోయి కనిపించింది..

దీంతో ఆమెకు ఆపరేషన్ చేసి కిలో కు పైగా బరువున్న చేసి జుట్టును తొలగించారు. రక్తహీనత వల్ల 20 ఏళ్ల లోపు ఉన్న బాలికలకు ఉంటుందని డాక్టర్ పొట్లూరు వంశీకృష్ణ తెలిపారు. ట్రైకో బీజర్ తో బాధపడుతున్న ఈ అమ్మాయికి ఆపరేషన్ చేసి పొట్టలో ఉన్న జుట్టుని తొలగించినట్లు వైద్యులు తెలిపారు. ఈ సమస్య ఉన్న ఆడపిల్లలు ఎవరైనా తమ జుట్టును తాము తినడం లేదంటే తీసుకొని తింటూ ఉంటారు. ఎండోస్కోపీ చేయడం వల్ల ఈ అరుదైన వ్యాధి ఉందని మేము గుర్తించాము.
అందుకే ఆపరేషన్ చేసి దానిని తొలగించామని వైద్యులు తెలిపారు. 15000 వేల మందిలో ఒకరి ఈ అలవాటు ఉంటుందని వైద్యులు చెప్పారు. ఆపరేషన్ తర్వాత ఆ బాలిక ఆరోగ్యం కుదుటపడిందని తెలిపారు.