Samantha : శాకుంతలం లో రెట్టింపు అందంతో మెరిసిపోతున్న సమంత..

Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గుణశేఖర్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా శాకుంతలం.. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. పౌరాణిక నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.. తాజాగా ఈ సినిమా నుంచి ఓ పాటను విడుదల చేయగా.. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..

ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా వరుస పాటలను విడుదల చేస్తున్నారు చిత్ర యూనిట్. తాజాగా విడుదలైన ఫోటోలలో సమంత రెట్టింపు అందంతో కనిపిస్తోంది. చూడటానికి చూడ చక్కనమ్మగా కనిపిస్తోంది.. ఈ ఫోటోలు చూశాక అసలు సమంత కి మాయోసైటీస్ తనకేనా వచ్చింది అనిపిస్తుంది. ఈ పాటలను మణిశర్మ స్వరపరిచారు. మొదటిసారి సమంత పౌరాణిక పాత్రలో నటిస్తోంది. ఈ పౌరాణిక నాటకంలో దేవ్ మోహన్ రాజు దుశ్యంతుడి పాత్రలో నటిస్తున్నారు.

Samantha glory double on shaakuntalam latest clicks
Samantha glory double on shaakuntalam latest clicks

ఈ సినిమాలో మోహన్ బాబు, ప్రకాష్ రాజు, గౌతమి, అదితి బాలన్, అనన్య నాగళ్ళ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్, పాటలు అన్నీ సినిమా పై హైప్ క్రియేట్ చేశారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాను నీలిమ గుణశేఖర్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మించారు.. మంచి అంచనాల నడుమ వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.

ఇటీవల సమంత తమిళనాడులోని పలని మురుగన్ స్వామి ఆలయానికి వెళ్లారు.. సమంత 600 మెట్లు ఎక్కడమే కాదు.. మెట్టు మెట్టుకు కర్పూరం వెలిగిస్తూ భక్తి పారవశ్యంలో మునిగిపోయిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. విజయ్ దేవరకొండ సమంత జంటగా నటిస్తున్న ఖుషి సినిమా షూటింగ్ లోనే సమంత పాల్గొంటున్న సంగతి తెలిసిందే. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో సీటాడెల్ అనే వెబ్ సిరీస్ లోను నటిస్తోంది.