Girl Twist : ఐశ్వర్యారాయ్ కి మించిన అందగత్తె.. ఒళ్ళు గగుర్లు పొడిచే ఆమె కథ తెలిస్తే..

Girl Twist :మంచితనంతో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు గురు ప్రాణాలు తీసేసింది జాలీ.. ఆమెను చూస్తుంటే మాటల్లో తీయదనం చేతల్లో కమ్మదనం ఉంటుంది కానీ చేసేవన్నీ కూడా కానరాని పనులు.. ఎవ్వరికీ అనుమానం లేకుండా ఒక్కొక్కరిని వధ చేయడానికి కనీసం నాలుగు సంవత్సరాల వ్యవధి తీసుకొని పక్కాగా ప్లాన్ చేసింది జాలీ.. పేరుకే జాలీ.. ఈమె పేరులో జాలీ దయా కరుణ అనేది మచ్చుక కైనా కానరావు..

జాలీ అత్తమామలు అన్నమ్మ ధమాస్, టామ్ ధమాస్.. వీరికి ఇద్దరు కొడుకులు ఒక కూతురు. పెద్ద కొడుకు రోజ్ థామస్ అమెరికాలో ఉంటున్నాడు ప్రస్తుతం. జాలీ ధామస్ భర్త రాయ్ ధామస్.. వాళ్ల కూతురు రేంజి పెళ్లి అయ్యి వేరే చోట ఉంటుంది.

టామ్ థామస్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో మంచి జాబ్ చేసి రిటైర్ అయ్యారు. అన్నమ్మ ధామస్ టీచరుగా పనిచేసే రిటైర్ అయ్యారు. ఆస్తులు బాగానే సంపాదించారు. కేరళ లోని కోలి కట్ లో వీరి కుటుంబానికి మంచి పేరే ఉంది. జాలీ అత్తమామలకు సేవ చేసుకుంటూ ఇంట్లో బాగానే ఉంటుంది . కానీ తనకు డబ్బు మీద ఆశ ఎక్కువ. పైగా ఇంటి పెత్తనం మొత్తం తనే చలాయించాలని అనుకుంటుంది. అందుకోసం ముందుగా తన అత్తకి సైనేడ్ పెట్టి చంపేస్తుంది. ఈ విషయం ఎవరికీ అనుమానం రాకుండా తను తినే ఆహారంలో ఒకే ఒక్క చుక్క సైనైడ్ కలిపి ఇస్తుంది. దాంతో బాత్రూం కి వెళ్లి రాగానే ఆమె మరణిస్తుంది. ఆమె చనిపోయిన కూడా జాలీ కోరుకున్నట్లు జరగలేదు.

తన మామ టామ్ దామస్ కుటుంబ వ్యవహారాలన్నీ చూసుకునేవాడు. ఒక నాలుగు సంవత్సరాలు గ్యాప్ ఇచ్చి ఆయన తీసుకునే ఆహారంలో విషం పెట్టి చంపేసింది జాలి. ఆ తరువాత టామ్ బావ మరిది మ్యాత్యూ కంప్లైంట్ చేశాడు పోలీసులకు పోలీసులు మంత్రంగా ఎంక్వయిరీ చేసి వదిలేసారు ఇక జాలి కోరుకున్న విధంగా ఇంటి బాధ్యతలు అన్నీ తనే చూసుకుంటుంది కానీ అస్తి మొత్తం తనకే దక్కాలని ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసింది. కానీ భర్త రాయ్ ధామస్ ఇవన్నీ మనకు వద్దు మనకు వచ్చే వాటా మనకు చాలు అని చెబుతాడు జాలి నాకే ఎదురు తిరుగుతావా అని మనసులో అనుకొని ఒక రోజు తన భర్తకి కూడా సైనేడ్ పెట్టి చంపేస్తుంది. ఇట్లు వరుసగా ఇలా ఊడి హత్యలు జరిగేసరికి మ్యాత్యూ మరోసారి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు కానీ ఫలితం రాలేదు . జాలీ తన డబ్బులతో రియల్ ఎస్టేట్ చేయడం మొదలుపెట్టింది డబ్బులు దండిగా వస్తున్నాయి. ఇక జాలికి భయం మొదలైంది. ఒకరోజు మ్యాత్యూ కి కూడా ఎవ్వరికీ అనుమానం రాకుండా తనకి ఫుడ్ లో ఒక చుక్క సైనైడ్ కలిపి ఇచ్చి తన పని పూర్తి చేసుకుంది. జాలీ నా పని తాను చేసుకుంటూ పోతుంది కానీ ఒంటరిగా ఉండటంతో తన మామ తమ్ముడైన షాజు పై ఆమె కన్ను పడింది. అతనికి పెళ్లి ఓ కూతురు కూడా ఉంది. ముందుగా ఆ పాప తినే బ్రెడ్డులో చుక్కంత సైనేడ్ కలిపి ఆ పాపని చంపేసింది జాలీ. ఇంట్లో వరుసగా చనిపోతున్న కూడా ఎవ్వరికీ అనుమానం రాలేదు ఒక్కొక్క మరణానికి 4నుంచి 5 ఏళ్లు తేడా ఉండేటట్టు జాలి ప్లాన్ చేసుకుంది. షాజు భార్య అప్పుడప్పుడు తను కూతురు చనిపోయిందన్న బాధలో నుంచి తీరుకోవడానికి తన పుట్టింటికి వెళ్ళేది ఆ సమయంలో షాజు ను తన గ్రూపులోకి తెచ్చుకుంది జాలి.

ఒకరోజు జాలి షాజు భార్య సిరిని తీసుకొని బయటకు వెళ్ళింది ఒక బేకరీ దగ్గర వాళ్లు తింటున్న బ్రెడ్ లో ఎవ్వరికి అనుమానం రాకుండా సిరి బ్రెడ్ పై ఒక్క చుక్క సైనైడ్ రాసింది. దాంతో ఆమె ప్రాణం పోయింది. ఆ తరువాత షాజుని పెళ్లి చేసుకుందామని ఒత్తిడి చేసింది జాలి ఇక అందుకు రాజు కూడా ఒప్పుకొని తన భార్య చనిపోయిన 20 రోజులకే జాలిని పెళ్లి చేసుకుంటాడు షాజు. కొన్నాళ్లపాటు వీళ్లిద్దరూ బాగానే ఉన్నారు. కానీ పాపం పండక మానదు. జాలి ఫేక్ డాక్యుమెంట్స్ ని సృష్టించి ఆస్తంతా తన సొంతమయ్యేలా చేసుకోవాలని అనుకుంది. కానీ అందుకు టామ్ పెద్దకొడుకు, కూతురు ఒప్పుకోలేదు . ఆస్తిలో మాకు కూడా వాటాలు వస్తాయంటూ పోలీస్ స్టేషన్లో కేసు వేశారు. దాంతో అసలు నిజాలు బయటకు వచ్చాయి.

ఇంట్లో ఎందుకు వరస మరణాలు జరిగాయని ఎంక్వయిరీ చేయగా జాలి నిజాలు ఒప్పుకుంది .దాంతో ఆరుగురు ప్రాణాలు తీసింది తనే అని పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చారు. అయితే ఈ కేసు ఇంకా కోర్టులో జరుగుతూనే ఉంది. అదే ఇంటికి చెందిన మరో ఇద్దరు చనిపోగా.. ఆ రెండు తో కూడా కలిపి మొత్తం ఎనిమిది కేసులు జాలి పై ఉన్నాయి.