Andhra Pradesh.. తాజాగా జగన్ సర్కార్ గ్రామ, వార్డు వాలంటీర్లకు ఊహించని ట్విస్ట్ ఇచ్చే విధంగా అడుగులు వేస్తోందా అంటే అవుననే చెప్పాలి.. రాష్ట్రంలో దాదాపుగా 2.5 లక్షల మంది వాలంటీర్లు పనిచేస్తున్నారు.. వీరి ద్వారా జగన్ సర్కార్ ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించే ప్రయత్నం చేస్తుంది. అయితే వైసీపీ పార్టీ వీళ్లను తమ పార్టీ కోసం వాడుకుంటుందనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.. వాలంటీర్ల ఉద్యోగాల విషయంలో చట్టబద్ధత లేదనే విషయం తెలిసిందే. కేవలం 5000 రూపాయల వేతనానికి వాలంటీర్లు పనిచేస్తున్నారు. ఒక కేసు విచారణ సందర్భంగా వాలంటీర్లు ఏ హోదాతో అర్హులను గుర్తిస్తారని ప్రశ్నించడం గమనార్హం. ఈ వ్యవస్థ చట్టబద్ధత గురించి హైకోర్టు ప్రశ్నించిన నేపథ్యంలో జగన్ సర్కార్ రాబోయే రోజుల్లో ఏవిధంగా ముందుకు వెళ్తుందో చూడాల్సి ఉంది.
పార్టీ అవసరాల కోసం ప్రభుత్వం వాలంటరీ వ్యవస్థను సృష్టించిందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.. రాబోయే రోజుల్లో ఇతర పార్టీలు అధికారంలోకి వచ్చినా సరే వాలంటీర్ల వ్యవస్థ కొనసాగే అవకాశాలు ఉన్నాయని కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి.. ఒకవేళ ప్రభుత్వం తమకు వాలంటీర్ల వ్యవస్థ వల్ల ఇబ్బందులు ఎదురవుతాయని భావిస్తే మాత్రం ఈ వాలంటీర్ వ్యవస్థ రద్దు దిశగా అడుగులు పడతాయి. ప్రస్తుతం ఈ విషయం తెలిసిన వాలెంటీర్లు ఎలా స్పందిస్తారో చూడాలి.