అమెరికా వెళ్లిన రామ్ చరణ్.. బాలయ్య పై ఓపెన్ కామెంట్స్

RamCharan :మగధీర సినిమాతో స్టార్ హీరోగా మారిన రామ్ చరణ్.. రెండోసారి ఆయన దర్శకత్వంలో డైరెక్ట్ ఎక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యారు.. అంతేకాదు ఈ సినిమాతో గ్లోబల్ స్టార్ గా సత్తా చూపెడుతున్నాడు.. తాజాగా రామ్ చరణ్ హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు ప్రధాన ఉత్సవంలో పాల్గొనటానికి అమెరికా వెళ్లారు.. అక్కడి అభిమానులు రామ్ చరణ్ కి ఘన స్వాగతం పలికారు రామ్ చరణ్ తో కలిసి ఫోటోలు దిగడానికి ఏగబడ్డారు..

తాజాగా అమెరికాలోని న్యూయార్క్ నగరంలో హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు ప్రధాన ఉత్సవంలో ప్రెసెంటర్ గా వ్యవహరించినన్నారు. ఈనెల 24ల అవార్డుల కార్యక్రమం జరగనుంది. తాజాగా మీడియాతో మాట్లాడుతూ రామ్ చరణ్ అక్కడికి హాలీవుడ్ కిట్రిక్స్ అవార్డ్స్ కి వచ్చానని.. అలాగే గుడ్ మార్నింగ్ ఇంటరాక్షన్ విత్ అమెరికాతో మాట్లాడుతున్నానని చెప్పారు.

ఒక తెలుగు వ్యక్తిగా మన తెలుగు వాళ్ళ ఔన్నత్యాన్ని చాటడానికి మీరు పాన్ ఇండియా సినిమాలు తీయడం కానీ ఆస్కార్లో నిలబడటం చాలా ఆనందంగా ఉంది. మీకు ఎలా ఉంది అని ప్రశ్నించగా.. ఇది ఒక అదృష్టంగా భావిస్తున్నాను అని రామ్ చరణ్ తెలిపారు. రాజమౌళి గారి సినిమాలలో ఎప్పుడు చేసినా ఎనలేని ఆనందాన్ని నేను పొందుతాను.

నందమూరి బాలకృష్ణ అండ్ స్టాపబుల్ షోలో మీరు పాల్గొనకపోయినా కానీ.. మీరు ఫోన్ కాల్ లో మాట్లాడిన మాటలు అందరికీ ఎంతో ఆనందాన్ని ఇచ్చాయి అని తెలిపారు. ఆహా షో మీద మీ అభిప్రాయం, బాలయ్య గారి మీద మీ అభిప్రాయం చెప్పమనగా.. ఆహా టిఆర్పి రేటింగ్స్ చూస్తుంటే నెంబర్ వన్ షో గా ఉందని చెప్పాలి.. బాలయ్య గారు నిజంగా అన్ స్టాపబుల్.. ఆయన లెజెండ్.. మోర్ దెన్ హ్యాపీ ఇన్విటేషన్ వస్తే నేను కచ్చితంగా చేస్తాను అని రామ్ చరణ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 2023 సంవత్సరం మీకు అంతా కలిసి వచ్చింది. మీకు ఎలా ఉంది అంటే .. మీ అందరి బ్లెస్సింగ్స్ వల్లే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానని.. మీ అందరికీ కూడా ఈ సంవత్సరం మంచి కలగాలని కోరుకుంటున్నాను అని రామ్ చరణ్ తెలిపారు.