Kanthara 2: కన్నడ నటుడు, డైరెక్టర్ రిషబ్ శెట్టి తెరకెక్కించిన కాంతార సినిమా ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలే బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. కేజిఎఫ్ తర్వాత కన్నడ సినిమా పరిశ్రమ గురించి మాట్లాడుకునేలాగా చేసింది కాంతార సినిమా.. ఈ సినిమా బడ్జెట్ కి నాలుగు రెట్లు లాభాలను తీసుకువచ్చిందంటే ఏ మేరకు సక్సెస్ అందుకుందో ఊహించవచ్చు.. కాంతారా సినిమాకి సీక్వెల్ ఉంటుందని ముందుగానే రిషబ్ తెలియజేశారు.. అయితే ఈ సినిమా కథ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది..
కర్ణాటక ఆదివాసీ ప్రజల సంస్కృతి, సంప్రదాయాల ఆధారంగా రూపొందించిన ఈ సినిమా అందర్నీ ఆకట్టుకుంది. క్లైమాక్స్ లో రిషబ్ నటన సినిమాకే హైలైట్. ఇప్పటికే డైరెక్టర్ రిషబ్ శెట్టి స్టోరీ మీద కసరత్తు చేస్తున్నాడని టాక్. ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా సెట్స్ మీదకు తీసుకెళ్లాలని ఆలోచనలో ఉన్నారట. 2024 సమ్మర్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
నిర్మాత, హోంబలే ఫిలింస్ వ్యవస్థాపకుడు విజయ్ కిరగందూర్ కాంతార 2 పై మాట్లాడారు. “రిషబ్ ఇప్పుడు కథను రాస్తున్నాడు. సినిమా కోసం పరిశోధన చేయడానికి రెండు నెలల పాటు తన రైటింగ్ అసోసియేట్‌లతో కోస్టల్ కర్ణాటక అడవులకు వెళ్ళాడు.” అని తెలిపారు.
కాంతారా సినిమాలో శివ పాత్ర తండ్రి లాగ భూతకోలా చేస్తూ అడవిలోకి వెళ్లి మాయం అయ్యాడు. ఇప్పుడు కాంతార 2 లో శివ తండ్రి దగ్గర సినిమా కథ ప్రారంభించే అవకాశం ఉంది. అక్కడ నుంచి.. భూములు ఎలా వచ్చాయి.. ఆ తర్వాత జరిగిన అంశాల చుట్టూ.. కథను అల్లుకునే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. రిషబ్ శెట్టి కర్ణాటకలోని కోస్టల్ ప్రాంత నేపథ్యాన్ని అడిగి తెలుసుకుంటున్నాడు. కాంతారా సినిమా సీక్వెల్ లో మరిన్ని విషయాలను చెప్పాలని రిషబ్ శెట్టి నిర్ణయించుకున్నాడు. కాంతార చిత్రం ఏ అంచనాలు లేకుండా వచ్చింది.. కానీ ఇప్పుడు కాంతార 2 పై భారీ అంచనాలున్నాయి. మరి ఆ అంచనాలను రిషబ్ ఏ మేరకు అందుకుంటాడో చూడాలి..