Kabzaa: ట్రైలర్ తోనే దుమ్ము దులిపేస్తున్న ఉపేంద్ర..!

Kabzaa.. తాజాగా కన్నడ ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఉపేంద్ర నటిస్తున్న కబ్జా సినిమా వస్తోంది. ఇందులో కిచ్చా సుదీప్ ,ఉపేంద్ర కలిసి నటిస్తున్నారు. ఈ సినిమాకు చంద్రు దర్శకత్వం వహిస్తుండగా.. ఇందులో శ్రేయ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో శివన్న స్పెషల్ రోల్ చేస్తున్నాడు. ఇప్పటివరకు పోస్టర్స్ , టీజర్ తో అంచనాలను పెంచేసిన ఈ సినిమా నుంచీ తాజాగా ట్రైలర్ ని కూడా లాంచ్ చేశారు. రిచ్ విజువల్స్, స్టెల్లార్ కాస్ట్ , ఎలక్ట్రిఫైయింగ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఫ్యూజ్ సెటప్స్ లాంటి విషయాలు ట్రైలర్ ని మాస్టర్ పీస్ లా మార్చాయి.. అయితే ఇంటర్ కట్స్ ఎక్కువగా ఉండడంతో ఆ ట్రైలర్ ని కాస్త ఎక్కువ సేపే చూసిన ఫీలింగ్ కలుగుతోంది.

Advertisement

Kabzaa movie trailer: Kannada film starring Upendra, Kichcha Sudeep dubbed  in Hindi

Advertisement

మరోవైపు ట్రైలర్ చూసిన తర్వాత సినిమాపై పెరిగిన అంచనాలు చూస్తుంటే కబ్జా సినిమా పాన్ ఇండియా హిట్ అయ్యే సత్తా ఉందని అనిపిస్తోంది. మార్చి 17వ తేదీన అందరి అంచనాలను అందుకొని ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందేమో చూడాలి. మొత్తానికి అయితే ఈ ట్రైలర్ కేజీఎఫ్ రేంజ్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ మరి సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.

Advertisement