Manoj – Mounika: భారీ బందోబస్తుతో ఆళ్లగడ్డకు బయలుదేరిన మనోజ్ – మౌనిక..!

Manoj – Mounika.. గడిచిన కొద్ది రోజుల క్రితం నుంచి సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న వార్త మంచు మనోజ్ – భూమా మౌనిక పెళ్లి వార్త. ఎట్టకేలకు మార్చి మూడవ తేదీన వీరిద్దరూ మంచు లక్ష్మి ఇంట్లో వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లికి ఇద్దరి కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు సైతం హాజరయ్యారు. ఇక పెళ్లి అనంతరం కొత్త జంట ముందుగా కర్నూలుకు వెళ్ళబోతున్నారు. తాజాగా మనోజ్ తన భార్య మౌనిక రెడ్డి తో కలిసి అత్తారింటికి బయలుదేరుతున్నట్లుగా కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Advertisement

Are Manchu Manoj and Bhuma Mounika Reddy planning to embark on a romantic  Maldives honeymoon? | Telugu Movie News - Times of India
నేరుగా మంచు లక్ష్మి ఇంటి నుంచి మనోజ్ ,మౌనిక కర్నూలుకు వెళ్లడానికి సిద్ధమయ్యారు.. భారీ బందోబస్తు మధ్య రోడ్డు మొత్తం కార్లు కాన్వాయర్లతో వీరి ప్రయాణం సాగింది అందుకు సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది. అలా మొదట పొద్దుటూరు వెళ్లి అనంతరం ఆళ్లగడ్డ ప్రాంతంలోని మౌనిక తల్లిదండ్రుల సమాధి దర్శించుకొని ఆశీర్వాదం తీసుకోబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతోంది.

Advertisement

Advertisement