Janasena: 2024 ఎన్నికలలో ఆ 20 స్థానాలు జనసేనవే..!

Janasena.. జనసేన పార్టీ ప్రభావం ముందు కంటే ఇప్పుడు మరింత ఊపందుకుందని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పుడు జనసేన చాలా కీలకంగా మారుతోంది. పవన్ కళ్యాణ్ ఇంకా బస్సు యాత్ర ప్రారంభించక ముందే ఆయన బలం ఎవరు ఊహించని రేంజ్ లో పెరుగుతోందని తాజాగా సర్వే రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది. అందుకే వైసిపి పార్టీ కూడా ఈసారి జనసేన పార్టీని చాలా సీరియస్గా తీసుకున్నట్టు సమాచారం 2019 ఎన్నికలలో జనసేన పార్టీకి కేవలం 7% ఓట్లు మాత్రమే వచ్చాయి.

Janasena party leader detained

ప్రస్తుతం ఉన్న ఓటు బ్యాంకును పరిశీలిస్తే జనసేన పార్టీ 12 శాతానికి పెరిగిందని తెలుస్తోంది. ఇదంతా పక్కన పెడితే సొంతంగా పోటీ చేస్తే ఈసారి 20 స్థానాలలో కచ్చితంగా గెలుస్తుందని సర్వే రిపోర్ట్ లో చెబుతున్నాయి. 2024 ఎన్నికలలో ఈ 20 స్థానాలలో ముందుగా ఈ పార్టీ గెలవబోయేది భీమవరంలోనే. ఎందుకంటే 2019లో పవన్ కళ్యాణ్ ఈ స్థానం నుండి పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన ఓడిపోవడానికి ప్రధాన కారణం రెండు గ్రామాలు అని తెలుస్తోంది. ఇప్పుడు ఆ గ్రామాలలో జనసేన పార్టీ పదింతలు బలం పుంజుకుంది. ఇక ఆ తర్వాత పిఠాపురంలో జనసేన పార్టీ గెలిచే అవకాశం ఉంది. వీటితోపాటు తాడేపల్లిగూడెం, గాజువాక, రాజోలు, ముమిడివరం, కాకినాడ రూరల్, తుని, రాజమండ్రి , అమలాపురం, మండపేట , పాలకొల్లు, తణుకు, కొత్తపేట , పెడన, విజయవాడ ఈస్ట్ , గుంటూరు వెస్ట్ , పెద్దాపురం, అవనిగడ్డ వంటి ప్రాంతాలలో కూడా పవన్ గెలిచే అవకాశం కనిపిస్తోంది.