Jr.NTR: కాసేపట్లో ఆస్కార్ నామినేషన్లు — ఎన్టీఆర్ పేరు గ్యారెంటీ .. కారణం ఇదే !

Jr.NTR: దర్శకరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం ఆర్ఆర్ఆర్.. ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లతోపాటు అనేక అవార్డులను రివార్డులను అందుకుంది .. తాజాగా నాటు నాటు సాంగ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకుంది.. అలాగే ఆస్కార్ బరిలో ఒరిజినల్ సాంగ్ లో నాటు నాటు సాంగ్ నామినేషన్ కి ఎంపికైంది.. అయితే ఈ సినిమా బెస్ట్ యాక్టర్ కేటగిరీలో జూనియర్ ఎన్టీఆర్ పేరు వినిపిస్తుంది.. ఈ విషయాన్ని ఏకంగా ఓ అమెరికన్ మ్యాగజైన్ ప్రచురించింది.

Junior NTR confirmation on Oscar nominations
Junior NTR confirmation on Oscar nominations

తారక్ కు బెస్ట్ యాక్టర్‌గా ఆస్కార్ పొందే ఆస్కారం ఉందని ప్రచురించింది ప్రముఖ అమెరికన్ పబ్లికేషన్ యుఎస్‌ఎ టుడే. అమెరికాకు చెందిన ఈ పత్రిక తన కథనంలో రాస్తూ.. నటుడు జూనియర్ ఎన్టీఆర్ టాప్ ఆస్కార్ పోటీదారుగా ఉండబోతున్నాడని ముందుగానే చెప్పింది.. అంతేకాదు ఓ జాబితాను ప్రకటించింది. ఇక ఇదే లిస్ట్‌లో జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు టామ్ క్రూజ్ (టాప్ గన్: మావెరిక్), పాల్ డానో (ది బ్యాట్‌మాన్), లషానా లించ్ (ది ఉమెన్ కింగ్, మటిల్డా ది మ్యూజికల్), పాల్ మెస్కల్ (ఆఫ్టర్సన్), కేకే పాల్మెర్ (నోప్) జెరెమీ పోప్ (ది ఇన్‌స్పెక్షన్), మియా గోత్ (పెరల్), నీనా హోస్ (తార్), జో క్రావిట్జ్ (కిమీ), వంటి నటీ, నటులు ఉన్నారు..

యుఎస్‌ఎ టుడే కథనం ఏమేరకు నిజం అవుతుందో చూడాలి.. కాగా ఈ మ్యాగ్జన్లో ప్రచురించినవి చాలా వరకు నిజమే అయ్యాయని తెలుస్తోంది దీనిని బట్టి చూస్తే ఎన్టీఆర్ ఖచ్చితంగా ఆస్కార్ బరిలో నిలవడం ఖాయమని అనిపిస్తుంది.. ఇక ఇంతకు ముందు కూడా వెరైటీ మ్యాగజైన్ ఎన్టీఆర్ ఆస్కార్ పొందే అవకాశం ఛాన్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే..

 

దీనిని బట్టి మొదటి సారి మన టాలీవుడ్ హీరో ఆస్కార్ బరిలో నిలవనున్నడాన్నా వార్త అందరికి అనందాన్ని కలిగిస్తుంది.. తారక్ ఫ్యాన్స్ తోపాటు టాలీవుడ్ ప్రేక్షకులు అంతా ఈ న్యూస్ నిజమావ్వలి అని కోరుకుంటున్నారు. ఇలా వరుసగా అమెరికన్ మ్యాగజైన్సులో తారక్ ఆస్కారి భారీలో నిలవనున్నాడు అనే వార్త రావటం కచ్చితంగా నిలుస్తాడనడం కాయమనిపిస్తోంది.