Balakrishna: నందమూరి బాలకృష్ణ స్టేజ్ పైకి వెళ్లి మైక్ పట్టుకున్నాడంటే ఆరోజుల్లో నాన్నగారు అంటూ ఎటు నుంచి ఎటు టాపిక్ ని మళ్లిస్తారో.. చివరికి ఎలా ముగిస్తారో ఎవరికీ అంతు చిక్కదు.. చాలా వేదికలపై బాలయ్య మాట్లాడిన తీరు పలు వివాదాలకు దారి తీయడం.. మహిళా సంఘాలు ధర్నాలకు దిగడం తెలిసిందే.. తాజాగా వీర సింహారెడ్డి విజయోత్సవం వేదికగా బాలకృష్ణ చేసినా వ్యాఖ్యలు అలాగే ఉన్నాయి..
సంక్రాంతి సినిమాల్లో వీర సింహారెడ్డికి మంచి ఆదరణ దక్కడంతో మేకర్స్ హైదరాబాద్ లో మేకర్స్ భారీగా విజయోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బాలకృష్ణ స్టేజ్ పై మాట్లాడుతూ.. ఈ సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికి అభినందలు తెలిపారు. అంతే కాకుండా తండ్రి స్వర్గీయ నందమూరి తారక రామారావుని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా స్టేజ్ పై వున్న నిర్మాతలతో సరదా పంచ్ లు వేశారు..
అక్కడితో ఆగక పక్కన ఎవరి గురించో మాట్లాడుతూ వెళ్లి ఈయన వున్నాడంటే సెట్ లో ఏదో ఒకటి.. అంటూ ఆ రోజుల్లో మీ నాన్నాగారి గురించి.. ఆ రంగారావు.. ఈ రంగారావు.. అక్కినేని.. తొక్కినేని.. అంటూ టంగ్ స్లిప్పయ్యారు. దాంతో సోషల్ మీడియాలో ఊరుకుంటుందా ఎవరికీ తోచిన విధంగా వారు కామెంట్ లు చేస్తున్నారు.
ఇక్కడ అందరి ప్రశ్న ఏంటంటే.. బాలయ్య ఆ మాటలు అనుకోకుండా అన్నారా.. లేదంటే నాగార్జున జగన్ కు సపోర్ట్ గా వున్నారని ఇండైరెక్ట్ గా ఇలా అన్నారా.. అక్కినేని తొక్కినేని అని పెద్ద మాట అన్నాడు అంటే కచ్చితంగా బాలకృష్ణ కి నాగార్జున అంటే ఎప్పటి నుంచో పగ ఉండి ఉంటుంది.. ఆ ఆవేశం ఈ రోజు కట్టలు తెంచుకుంది అని నెటిజన్స్ అంటున్నారు.. నాగార్జున ఈ విషయంపై స్పందిస్తే ఇక ఈ వ్యాఖ్యలు ఎటు వైపుకు దారితీస్తాయో చూడాలి.