Jr. NTR: దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎన్ని ప్రశంసలు అందుకుందో చెప్పనక్కర్లేదు. ఈ సినిమాకు వెస్ట్రన్ సినీ లవర్స్ కూడా ఫిదా అయ్యారు. దాంతో రామ్ చరణ్ త్వరలోనే హాలీవుడ్ లోకి అడుగుపెట్టబోతున్నాడు అనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజాగా మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే బ్లాక్ పాంథర్ గా జూనియర్ ఎన్టీఆర్ నటించిన బోతున్నారు అని.. దీనికి సంబంధించిన మార్వెల్ యూనివర్స్ ఇప్పటికే ఎన్టీఆర్ తో చర్చలు జరిపినట్లు సినీ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి..
జూనియర్ ఎన్టీఆర్ తన తాత నందమూరి తారకరామారావు నటవారసత్వాన్ని పునికి పుచ్చుకొని టాలీవుడ్ లో తనదైన శైలిలో దూసుకెళ్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా ఇంటర్వెల్ సీన్ లో జంతువులతో కలిసి దాడి చేసే సీన్ అయితే నెక్స్ట్ లెవెల్ అని హాలీవుడ్ ప్రేక్షకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సీన్ హాలీవుడ్ సన్నివేశాలకు ఏమాత్రం తీసుకోదని నెటిజన్ల వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ ను నెక్స్ట్ రేంజ్ లో చూపించడానికి మార్వెల్ యూనివర్స్ ప్లాన్ చేస్తున్నట్లు టాలీవుడ్ లో చర్చలు జరుగుతున్నాయి..
ఇటీవల నాటు నాటు సాంగుకు ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ అవార్డు ఫంక్షన్ కి హాజరైన జూనియర్ ఎన్టీఆర్ ను ఓ జర్నలిస్ట్ మీరు మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లోకి ఎంటర్ అవుతున్నారా అని ప్రశ్నించారు. బ్లాక్ పాంథర్ గా నటించబోతున్నారా అన్న ప్రశ్నకు తారక్ సమాధానం ఇస్తూ.. వెయిటింగ్ ఫర్ ఏ కాల్ అని జూనియర్ ఎన్టీఆర్ సమాధానం ఇచ్చినట్లు సమాచారం.
ఇక చాడ్విక్ బోన్స్ మెన్ చనిపోయిన తరువాత బ్లాక్ పాంథర్ క్యారెక్టర్ కు కరెక్ట్ గా అంత పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే హీరో ఎవరు దొరకలేదట.. ఎన్టీఆర్ అయితే ఆ పాత్రకు పర్ఫెక్ట్ అని ఆ క్యారెక్టర్ లో ఉన్న ఎమోషన్స్ సమపాళ్లలో పండిస్తాడని అభిమానులు వారి అభిప్రాయాలు సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో టోనీ స్టార్క్ పాత్ర అంటే చాలా ఇష్టమని గతంలో తారక్ చెప్పుకొచ్చారు. మరి మొత్తానికి హాలీవుడ్ లోకి తారక్ కూడా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.