Veera: ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద మాస్ జాతర జరుగుతుంది.. నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన వీరసింహ రెడ్డి మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య విడుదలైంది.. వీర సింహారెడ్డి విడుదలైన మొదటిరోజు బాలకృష్ణ ఊచ కోత కలెక్షన్స్ లను వసూలు చేశాడు.. డే వన్ బాలయ్య పవర్ చూపిస్తే.. డే 2లో చిరు విజృంభించాడు..
వాల్తేరు వీరయ్య మొదటి రోజు భారీ పోటీతో రిలీజ్ అయినా కానీ ఆల్మోస్ట్ వీర సింహారెడ్డి సినిమాకి దగ్గర అయ్యే రేంజ్ లో కలెక్షన్స్ ని వసూలు చేసుకుంది. రెండో రోజుకి వచ్చేసరికి వేరే సింహారెడ్డి తో 5.25 కోట్ల రేంజ్ లోనే షేర్ వసూలు చేయగలిగింది.
కానీ అదే టైంలో ఈ కలెక్షన్స్ కి డబల్ కి పైగా మార్జిన్ తో వాల్తేరు వీరయ్య సినిమా ఏకంగా 11.95 కోట్ల రేంజ్ షేర్ తో సెన్సేషనల్ చూపించి ఊర మాస్ బీభత్సం సృష్టించాడు చిరంజీవి. మొత్తం మీద డే వన్ బాలయ్య పేరు మీద ఉంటే.. డే టు మాత్రం భారీ మార్జిన్ తో వాల్తేరు వీరయ్య సినిమా సొంతం చేసుకుంది.
ఇక సంక్రాంతి వీకెండ్ లో మొత్తం మీద వాల్తేరు వీరయ్య సూపర్ మాస్ కలెక్షన్స్ తో మరింత రచ్చ చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి..
ఓ పక్క వారసుడితో పాటు చిన్న చిన్న సినిమాలు రిలీజ్ అయినా కానీ బాలయ్య చిరు మూవీలకే జనం ఎగబడుతున్నారు. అన్ని మాస్ సెంటర్లలో వీరు సినిమాలకి ఫుల్ టికెట్స్ బుక్ అవుతున్నాయి.
ఎక్కడ చూసినా వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలకు హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిస్తున్నాయి .వాల్తేరు వీరయ్య కలెక్షన్ల పరంగా చూసుకుంటే మాత్రం ఓ అడుగు ముందులో ఉందనే చెప్పాలి. ఇక వీళ్లిద్దరిలో బాక్స్ ఆఫీస్ విన్నర్ ఎవరో అవుతారో చూడాలి.