వైసీపీ నేత కొడాలి నాని, జూనియర్ ఎన్టీఆర్ మధ్య వున్న స్నేహం గురించి ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. కొడాలి నానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ మంచి మిత్రుడు, ఆప్తుడు అన్న సంగతి అందరికీ తెలిసిందే. నానిని ఎన్టీఆర్ ‘అన్న’ అని ఆప్యాయంగా పిలుస్తారు. అయితే అది ఒకప్పుడు. నాని వైసీపీలో చేరిన తరవాత వీరిద్దరి మధ్య దూరం పెరిగింది. కానీ, వాళ్ల మధ్య ప్రేమ మాత్రం పదిలంగానే ఉందని గుసగుసలు వినబడుతున్నాయి. ఇక నాని మాటలు వింటే అది నిజమేనేమో అని అర్థమవుతుంది. దానికి కొడాలి నాని ఇంటర్వ్యూలే ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
ఓ సందర్భంలో కొడాలి నాని మాట్లాడుతూ…. Jr ఎన్టీఆర్ తనకన్నా చాలా చిన్నవాడని, దాదాపు 11 నుంచి 12 ఏళ్ల తేడా ఉంటుందని కానీ వారిమధ్య చాలా మంచి స్నేహం కుదిరిందని చెప్పుకొచ్చారు. అతన్ని చూస్తే ఎన్టీ రామారావు గారిని చూసినట్టు ఉంటుందని కూడా అన్నారు. ఒకానొక సందర్భంలో పెద్ద ఎన్టీఆర్ కన్నా గొప్ప నటుడు జూనియర్ ఎన్టీఆర్ అని కీర్తించాడు నాని. Sr ఎన్టీ రామారావు గారు కొన్ని పాత్రలకు బ్రహ్మాండంగా సెట్ అవుతారు. కొన్నిటికి ఆయన సెట్ అవ్వరు. కానీ, జూనియర్ ఎన్టీఆర్‌కి సినిమా స్క్రీన్‌పై ఎదురులేదు. డ్యాన్స్ దగ్గర నుంచి ఏదైనా చేయగలడు. ఏ పాత్రనైనా చేయగలిగే సత్తా ఉన్న స్టార్ జూనియర్ ఎన్టీఆర్ అంటూ ఒకానొకప్పుడు ఎన్టీఆర్ పైన ప్రశంసల వర్షం కురిపించారు నాని.
అంతేకాకుండా ఎన్టీఆర్ విషయమై మాజీ మంత్రి కొడాలి నాని అప్పుడప్పుడు టీడీపీ పైన సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడు. నారా లోకేష్ కి అడ్డు వస్తారని భయంతో జూనియర్ ఎన్టీఆర్ ని తొక్కేశారని, ఎన్టీఆర్ డీఎన్ఏ లేకుండా టిడిపి కుట్రలు చేస్తోందని పలు సందర్భాల్లో నాని మాట్లాడిన విషయం అందరికీ తెలిసినదే. అయితే ఇలాంటి వ్యాఖ్యలకు మాత్రం ఎన్టీఆర్ ఎప్పుడూ స్పందించింది లేదు. ప్రస్తుతం జూనియర్ తన సినిమా షూటింగ్ లో బిజీగా వున్నాడు. కొరటాల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘దేవర’ సినిమా షూటింగులో ఎన్టీఆర్ బిజీబిజీగా వున్న సంగతి తెలిసినదే.
కాగా ఓ వార్త ఇపుడు సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తోంది. అవును, ఆప్త మిత్రులు అయినటువంటి నాని – ఎన్టీఆర్ మధ్య వార్ ఖాయం అని తెలుస్తోంది. విషయం ఏమంటే… వచ్చే ఎన్నికల్లో గుడివాడ నుండి MLA బరిలో నానికి పోటీగా టీడీపీ జూనియర్ ఎన్టీఆర్ భారీ లక్ష్మి ప్రణతిని దించుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. విషయం దేవుడికెరుక గానీ, ఇదేగాని నిజమైతే వారిద్దరి మధ్య స్నేహం ఉందా లేదా అన్న విషయం తేటతెల్లం అయిపోతుంది.