మీరు టురిటో (turito.com) అనే వెబ్ సైట్ గురించి విన్నారా? ఇది అత్యంత అనుభవజ్ఞులైన అధ్యాపకుల నుండి నాణ్యమైన ఆన్‌లైన్ మరియు క్యాంపస్ విద్య కోసం తయారు కాబడిన ఓ అద్భుతమైన టీచింగ్ ప్లాట్ ఫామ్. దీనిద్వారా IIT-JEE మరియు NEET కోసం 2 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ క్లాస్‌రూమ్ కోచింగ్‌ను అందిస్తున్నారు. అంతేకాకుండా IIT-JEE, NEET, SAT, ACT, PSAT, సబ్జెక్టివ్ SAT, AP & ఒలింపియాడ్‌లు మరియు 6 నుండి 10వ తరగతి (CBSE, ICSE & స్టేట్ సిలబస్) విద్యార్థులకు ఫౌండేషన్ కోర్సులు వంటి అన్ని రకాల పోటీ పరీక్షల కోసం ఆన్‌లైన్ కోచింగ్ ఇక్కడ లభించును.
ఇక అసలు విషయం ఏమిటంటే ఈ ప్లాట్ ఫామ్ తాజాగా తమకి ఆన్లైన్ టీచర్స్ కావాలని పోస్ట్ చేసింది. ఈ ప్లాట్ ఫామ్ ద్వారా మీరు రోజుకి నాలుగంటే నాలుగు గంటలు పనిచేస్తూ ఈజీగా వెయ్యి రూపాయిలు దాకా సంపాదించుకొంది. ఇదొక సదవకాశం అని చెప్పుకోవాలి. ఎందుకంటే మనదగ్గర పార్ట్ టైం రోజుకి నాలుగు గంటలు పనిచేసే ఉద్యోగాలే దొరకడం కష్టం. ఒకవేళ దొరికినా కూడా పెద్దగా సేలరీ ఉండదు. కాబట్టి విద్యార్థులు, ఉద్యోగాలకోసం ఎదురుచూసేవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు.
ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ ఇలా సబ్జెక్టు ఏదైనా సరే, మీ స్కిల్స్ ఉపయోగించి వుద్యోగం సంపాదించండి. దానికోసం మీరు చేయాల్సిందల్లా ఒక్కటే. సదరు వెబ్ సైట్ లోకి లాగిన్ అయ్యి, జాబ్ కోసం అప్ప్లై చేయండి.
విద్యార్హతలు:
కనీసం డిగ్రీ పాసై ఉండాలి.
తదితర సబ్జక్ట్స్ లో ఎక్స్పర్ట్ అయ్యి ఉండాలి.
గ్రేడ్ 4-12 విద్యార్థులకు బోధించడంలో అనుభవం ఉంటే మంచిది.
కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే మంచిది.
విద్యార్థుల సందేహాలను తేలిక పద్దతిలో అర్ధం చేయించాలి.
ఇప్పటికే ఈ ప్లాట్ ఫామ్ పైన 30+ సంవత్సరాల అనుభవం కలిగిన అధ్యాపకులు కలరు. US, సింగపూర్ మరియు మిడిల్ ఈస్ట్ రీజియన్‌లలోని విద్యార్థులకు ఈ వేదిక ద్వారా అత్యుత్తమ ఆన్‌లైన్ మరియు క్యాంపస్ ప్రోగ్రామ్‌లను అందిస్తున్నారు.
గమనిక: ఇక్కడ మీ మీ పని గంటల సంఖ్య ఆధారంగా ఆదాయం ఉంటుంది. రోజుకి నాలుగు గంటలు పని చేయడం ద్వారా మీరు నెలకు రూ. 60000 వరకు సంపాదించే వీలుంది. వివరాల కొరకు https://www.turito.com/in సంప్రదించండి. మరెందుకాలస్యం… మీ కలల ఉద్యోగం, టురిటో తో స్టార్ట్ చేయండి. అంతర్జాతీయ ఉపాధ్యాయ సంఘంలో మీరు భాగస్వామ్యం కండి.