మహేష్ బాబు పుట్టినరోజునాడు లక్షలాది మందికి అన్నదానం చేసిన నమ్రత?

తెలుగునాట సినిమా హీరోలకు వున్న క్రేజ్ అంతాఇంతా కాదు. తమ అభిమాన హీరో పుట్టినరోజు వచ్చిందంటే ఇక్కడ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటారు. తమ పుట్టినరోజులు అసలు గుర్తు వుంటాయో లేదో తెలియదు కానీ, అభిమాన హీరోల పుట్టినరోజులు అడిగితే ఠక్కున చెప్పేస్తారు ఇక్కడి కుర్రాళ్ళు. అంతేకాకుండా అభిమాన హీరో పేరు మీద ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడతారు. రక్తదానాలు చేస్తారు. అయితే ఈసారి మహేష్ బాబు అభిమానులు కాస్త భిన్నంగా ఆలోచించారు. సేవా కార్యక్రమాలతో పాటు తమ హీరోకి జీవితాంతం గుర్తుండిపోయే గిఫ్ట్ ఇచ్చారు.

అవును, ఆకాశంలో ఒక నక్షత్రానికి మహేష్ బాబు పేరు పెట్టారు. అంతేకాదు, ఆ పేరు రిజిస్ట్రేషన్ కూడా చేయించడం కొసమెరుపు. ఆగస్టు 9 నుంచి ఆ స్టార్‌ను మహేష్ బాబు అని పిలవనున్నారన్నమాట. ఇలాంటి రిజిస్ట్రేషన్ కూడా వుంటుందా అని అనుమానం కలుగుతోంది కదూ. ఉంటుంది మరి… తమ అభిమాన హీరో పుట్టినరోజు వచ్చిందంటే ఫ్యాన్స్ కి పూనకాలు వచ్చేస్తాయి మరి. ఇక నిన్న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ‘బిజినెస్‌మేన్’ సినిమాను రీరిలీజ్ చేయగా ఈ సినిమా విడుదలైన థియేటర్లు సెలబ్రేషన్స్‌తో దద్దరిల్లిపోతున్నాయి. ఇక, రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కేరళ, కర్ణాటకలోనూ మహేష్ బాబు అభిమానులు ఈరోజు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు.

ఈ నేపథ్యంలో అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలలో అన్నదానం కార్యక్రమాలు పెద్దఎత్తున చేపడుతున్నారు. తమ హీరో కలకాలం ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని కోరుకుంటూ ఈ సేవా కార్యక్రమాలను చేపడుతున్నట్టు ఫాన్స్ చెప్పుకొస్తున్నారు. ఇక, మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానుల కోసం ‘గుంటూరు కారం’ సినిమా నుంచి కొత్త పోస్టర్‌ను విడుదల చేసిన సంగతి విదితమే. లుంగీలో మహేష్ బాబు ఊర మాస్ లుక్ అదిరిపోయిందని ఫ్యాన్స్ అంటున్నారు.

త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతోన్న గుంటూరు కారం సినిమా కోసం అభిమాపులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు స్కాట్లాండ్‌లో ఉన్నారు. అక్కడే భార్య, ఇద్దరు పిల్లలతో తన పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. అయితే నమ్రత ఇక్కడ ముందుగానే మహేష్ పుట్టిన రోజునాడు పెద్దఎత్తున లక్షలాది మందికి అన్నదానం ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. తమ బంధువుల సమక్షంలో ఆయా కార్యక్రమం నిన్న విజయవంతంగా జరిగినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.