ESIC Jobs : హైదరాబాద్ ఈఎస్‌ఐసీ లో ఉద్యోగాల భర్తీ..!!

ESIC Jobs : భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు చెందిన సంస్థ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. హైదరాబాదులో ఉన్న సనత్ నగర్ లోని..ESIC లో పలు ఒప్పంద ప్రతిపాదింకంగా పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ,నోటిఫికేషన్ ను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

1). మొత్తం ఖాళీల పోస్టుల సంఖ్య: 311 ఇందులో ఫ్యాకల్టీ పోస్టులు-77, సూపర్ స్పెషలిస్ట్ పోస్టులు-11, సీనియర్ రెసిడెంట్ పోస్టుల-97, స్పెషాలిటీ స్పెషలిస్ట్ పోస్టులు-5, జూనియర్ కన్సల్టెంట్ పోస్టులు-20, బ్రాడ్ స్పెషాలిటీ పోస్టులు-28, జూనియర్ రెసిడెంట్ పోస్టులు ( బ్రాడ్ స్పెషాలిటీ)-37, జూనియర్ రెసిడెంట్ పోస్టులు-23

Job replacement in Hyderabad ESIC
Job replacement in Hyderabad ESIC

2). వయస్సు : అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల మధ్యలో ఉండాలి.

3). జీతభత్యాలు : అభ్యర్థులకు నెలకు రూ.60,000 నుండి రూ.2,80,254 వరకు జీతం చెల్లిస్తారు.

4). అర్హతలు : ఈ పోస్ట్ ను బట్టి సంబంధిత విభాగాలలో స్పెషలైజేషన్లు ఎంబిబిఎస్, ఎమ్మెస్సీ, మెడికల్ పీజీ/MD/MS/పీజీ డిప్లమా/పీహెచ్డీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత విభాగాల లో నోటిఫికేషన్లు సూచించిన విధంగా అనుభవం కూడా ఉండాలి.

5). ఎంపిక విధానం : అభ్యర్థుల అకాడమీ మెరిట్ ఆధారంగా, అనుభవం, నీట్ స్కోర్ 2021 ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది.

6). దరఖాస్తు విధానం : ఆసక్తి కలిగిన అభ్యర్థులు, అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు.. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఏప్రిల్ 17.

7). అభ్యర్థులు ఏదైనా పూర్తి సమాచారం కోసం అధికారిక వెబ్ సైట్ ను https://www.esic.nic.in/ సంప్రదించడం మంచిది.. ఇందులో అభ్యర్థులు ఏ పోస్టులకు అర్హులో వాటికి సంబంధించిన వారిటి కి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. అంతేకాకుండా అందుకు సంబంధించి అనుభవం కూడా కలిగి ఉండాలి.