SBI : ఎస్‌బీఐ ఖాతాదారులకు శుభవార్త.. ఈ స్కీం తో ప్రతి నెల రాబడి..!!

SBI  : ప్రభుత్వ బ్యాంకింగ్ సంస్థ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ ఖాతాదారులకు తాజాగా మరో శుభవార్త తీసుకురావడం జరిగింది. ఎవరైతే పొదుపు ద్వారా తమ భవిష్యత్తుని సురక్షితంగా మార్చుకోవాలని ప్లాన్ చేస్తున్నారో..అలాంటివారు కొన్నిసార్లు తప్పుడు పథకాలలో డబ్బులు ఇన్వెస్ట్ చేసి డబ్బు పోగొట్టుకుంటూ ఉంటారు. డబ్బుకు ఎక్కడైతే భద్రత ఉంటుందో అక్కడే పెట్టుబడిగా పెడితే మంచి రాబడి కూడా వస్తుంది. ఈ క్రమంలోనే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ల కోసం ఒక సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది.దాని పేరు యాన్యుటీ డిపాజిట్ పథకం.

ఈ పథకం ఎస్బిఐ కింద వచ్చే అన్ని శాఖలలో వర్తిస్తుంది. మీరు చేరాలి అంటే కనీసం 25 వేల రూపాయలను పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. ఇందులో డబ్బులు పెట్టే ఎస్బిఐ ఉద్యోగులకు .. మాజీ ఉద్యోగులకు ఒక శాతం ఎక్కువ వడ్డీ లభిస్తుంది . అదే సీనియర్ సిటిజన్లకు అయితే 0.5 శాతం ఎక్కువ వడ్డీ చెల్లించడం జరుగుతుంది. ఇకపోతే వడ్డీరేట్లు అనేవి టర్మ్ డిపాజిట్ పై ఆధారపడి ఉంటాయి. ఒకేసారి పెద్ద మొత్తంలో మంచి రాబడి పొందడానికి మెరుగైన ప్రణాళిక చేసుకోవాలి అని చెప్పవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో మీరు ఇన్వెష్ట్ చేసిన మొత్తంలో 75% లోన్ పొందే అవకాశం కూడా ఉంటుంది.

Good news for SBI clients Earnings every month with this scheme
Good news for SBI clients Earnings every month with this scheme

కాకపోతే ఎవరైనా సరే ఈ ఖాతాలో చేరిన తర్వాత ప్రతి నెలా పదివేల రూపాయలను ఆదాయం గా పొందాలి అనుకుంటే.. ఇందుకోసం రూ.5,7,965.93 పైసలు చెల్లించాల్సి ఉంటుంది. డిపాజిట్లపై మీకు 7 శాతం వడ్డీ కూడా లభిస్తుంది . ఫలితంగా ఖాతాదారుడు ప్రతినెల 10,000 రూపాయలు సంపాదించే అవకాశం ఉంటుంది. పెద్ద మొత్తంలో డబ్బు ఉంటే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఎస్బిఐ అందిస్తున్న ఈ నూతన పథకంలో డబ్బులు ఇన్వెస్ట్ చేసి ప్రతి నెల రాబడిని పొందవచ్చు.. ఎలాంటి రిస్క్ ఉండదు పైగా కచ్చితమైన నికర రాబడి వస్తుంది కాబట్టి సందేహం లేకుండా ఈ పథకంలో చేరవచ్చు.