Hair Tips : తలలో చుండ్రు , దురద తగ్గి పోవాలంటే..?

Hair Tips : వేసవి కాలం మొదలైంది కాబట్టి వేసవి తాపానికి తలలో దురద, చుండ్రు వంటి సమస్యలు అధికమవుతాయి. ముఖ్యంగా వీటిని తగ్గించుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ఖరీదైన నూనెలు, షాంపూలు ఉపయోగిస్తారు .అయితే ఇప్పుడు చెప్పబోయే చిట్కాతో ఇలాంటి ఖరీదైన వస్తువు లతో పనిలేకుండా కేవలం ఇంట్లో ఉండే వస్తువులతోనే చుండ్రు , దురద వంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఇప్పుడు చెప్పబోయే ఈ హెయిర్ మాస్క్ వల్ల తలలో వచ్చే అన్ని సమస్యలతో పాటు జుట్టు రాలే సమస్యను కూడా దూరం చేసుకోవచ్చు. అయితే ఆ హెయిర్ మాస్క్ ఏమిటి.. దాన్ని ఎలా తయారు చేయాలి.. కావలసిన పదార్థాలు ఏమిటి అనే విషయాలను పూర్తిగా చదివి తెలుసుకుందాం.

ముఖ్యంగా ఒక గిన్నె తీసుకొని అందులో రెండు చెంచాల పెరుగు, ఒక చెంచా శీకాకాయ పొడి, ఒక చెంచా అలోవెరా జెల్ వేసి బాగా కలిపి రెండు నిమిషాలు పక్కన పెట్టాలి. బాగా నానిన ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు మాడు నుంచి కుదుళ్ల వరకు పూర్తిగా అప్లై చేయాలి. ఇక అర గంటసేపు ఆగిన తర్వాత మీరు రెగ్యులర్ గా ఉపయోగించే గాఢత తక్కువ కలిగిన షాంపుతో తలస్నానం చేయాలి. మీరు కనుక ఈ చిట్కాలు వారానికి రెండుసార్లు ఉపయోగించినట్లయితే తప్పకుండా తలలో చుండ్రు , దురద వంటి సమస్యలతో పాటు జుట్టు రాలే సమస్య కూడా తగ్గిపోతుంది.

To reduce dandruff and itching in the head
To reduce dandruff and itching in the head

పెరుగు తల మీద ఉండే ఎటువంటి ఇన్ఫెక్షన్ అయినా సరే దూరం చేస్తుంది. అంతే కాదు కొత్తగా ఇన్ఫెక్షన్ సోకకుండా కాపాడుతుంది. శీకాకాయ జుట్టురాలడాన్ని ఆపడంతో పాటు చుండ్రును కూడా దూరం చేస్తుంది. అలాగే జుట్టును మృదువుగా కాంతివంతంగా తయారు చేస్తుంది. ఇక అలోవెరా కూడా మాడు మీద ఉండే ఇన్ఫెక్షన్ ను దూరం చేసి జుట్టు మృదువుగా మెత్తగా తయారవుతుంది. ఇక అలోవెరా జెల్ ఉపయోగించడం వల్ల చిట్లిపోయిన జుట్టు కూడా తిరిగి ఆరోగ్యంగా ఉంటుంది. అంతే కాదు ఒత్తుగా పొడవుగా పెరగడానికి ఈ చిట్కా బాగా పనిచేస్తుంది.