Hair Health Tips : వేసవి కాలంలో జుట్టు ఆరోగ్యాన్ని పెంచే ఆహారాలు..!

Hair Health Tips : నేడు ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్న సమస్యలలో జుట్టు సమస్య కూడా ఒకటి. అందుకే మీ జుట్టు నాణ్యతను మెరుగుపరచడంలో మనం తీసుకునే ఆహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. హెయిర్ మాస్క్ లను ఉపయోగించడం లేదా తలపై నూనె రాసుకోవడంతో పాటు ఆహార పదార్థాలు కూడా జుట్టు పెరుగుదలకు బాగా సహాయపడుతాయి. ఈ వేసవి కాలంలో జుట్టు సమస్యలు అధికమవుతాయి అలాంటప్పుడు ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి అనే విషయం ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.

చిలగడదుంపలు : జుట్టు రాలడం సమస్య అధికంగా ఉన్నట్లు అయితే చిలకడదుంపలు చాలా చక్కటి పరిష్కారం అని చెప్పవచ్చు. ఇందులో బీటా కెరోటిన్ ఉంటుంది అంతే కాదు బీటా కెరోటిన్ ను మనశరీరం విటమిన్-ఎ గా మార్చి జుట్టు ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. విటమిన్ ఎ జుట్టు సాంద్రతను ప్రోత్సహించడంతో పాటు జుట్టు మూలాలను కూడా బలపరుస్తుంది. అంతేకాదు జుట్టు పెరుగుదలను ప్రోత్సహించి జుట్టు విరిగిపోకుండా, ఒత్తుగా పెరగడానికి దోహదపడతాయి.

Foods That Enhance Hair Health During Summer
Foods That Enhance Hair Health During Summer

బెర్రీలు : వేసవి కాలంలో ఎక్కువగా దొరికే బ్లూ బెర్రీస్, స్ట్రాబెర్రీస్, క్రాన్ బెర్రీస్ వంటి బెర్రీలు వేసవికాలంలో అందుబాటులో ఉంటాయి. కాబట్టి వీటిని తినడం వల్ల విటమిన్ సి, యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. అంతేకాదు కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడంలో దోహదపడతాయి. జుట్టు దృఢంగా పెరగడానికి అవసరమైన ప్రోటీన్లు కూడా ఈ బెర్రీలు మనకు అందిస్తాయి.

బొప్పాయి పండు : బొప్పాయి తినడం లేదా బొప్పాయి గుజ్జును జుట్టుకు అప్లై చేయడం వల్ల రెండూ కూడా జుట్టుపై సానుకూల ప్రభావాలను చూపిస్తాయి. ఇక బొప్పాయి గుజ్జులో మనకు విటమిన్ సి తో పాటు ఫోలిక్ యాసిడ్ కూడా లభిస్తుంది. ఇది జుట్టు సాంద్రతను పెంచడానికి దోహద పడుతుందని ఒక అధ్యయనం ద్వారా వెల్లడైంది. కాబట్టి జుట్టు సమస్యలు ఉన్నవారు ఈ పండు ఉపయోగించవచ్చు.