PURE POSITIVITY : 2024 గెలుపు లక్ష్యం దిశగా స్ట్రాంగ్ స్కెచ్ తో జనసేన !!

PURE POSITIVITY : జనసేన పార్టీ కార్యక్రమాలు మెల్లి మెల్లిగా జోరందుకుంటోందా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరికీ అలాగే అనిపిస్తోంది. ఒకపుడు స్తబ్దుగా ఉండే స్ధానికనేతలు, కార్యకర్తలంతా కొద్ది కాలంగా యాక్టివ్ అయిపోతున్నారు. ముఖ్యంగా జనసేన ఆవిర్భావ సభ తర్వాత ఈ మార్పు కొట్టొచ్చినట్లు స్పష్టంగా కనబడుతోంది. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే రాబోయే ఎన్నికల్లో జనసేన యాక్టివ్ రోల్ తీసుకోవాలని పార్టీ అధినేత పవన్ కల్యాన్ డిసైడ్ అవ్వటమే.పార్టీ పెట్టి తొమ్మిదేళ్ళయినా నేతలు, కార్యకర్తలు ఇపుడున్నంత యాక్టివ్ గా గతంలో లేరనే చెప్పాలి. తిరుపతికి సమీపంలోని బాకరాపేట లోయలో బస్సు ప్రమాధం బాధితులను పరామర్శించటంలో కానీ చనిపోయినవారికి నష్టపరిహారం, క్షతగాత్రులకు పరిహారం అందిచటంలో జిల్లా నేతలు చాలా చురుగ్గా వ్యవహరించారు.

అలాగే వివిధ జిల్లాల్లోని యువతను, వివిధ రంగాల్లోని మేథావులను పార్టీలోకిఆహ్వానిస్తున్నారు.కాకినాడలోని ఎంఎస్ఎన్ కాలేజీ మైదానం స్ధలాన్ని వైసీపీ ఆఫీసుకు ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కాకినాడ యూనిట్ లోని జనసేన నేతలు, శ్రేణులు పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలను నిర్వహించారు. తాము మాత్రమే కాకుండా స్ధానికులను కూడా కలుపుకుని ఆందోళణ కార్యక్రమాలు నిర్వహించటంలోనే పార్టీ ఆలోచనలు ఏమిటో అర్ధమవుతోంది.ఇక ఇంటిపన్నులు కట్టలేదని, ఆస్తి పన్నును కట్టని వాళ్ళ ఇంటికి తాళాలు వేయాలన్న మున్సిపల్ అధికారుల నిర్ణయాన్ని స్వయంగా పవనే వ్యతిరేకించారు. దాంతో ఇదే విషయమై ఎక్కడికక్కడ లోకల్ లీడర్లతో కార్యకర్తలు కలిసి మున్సిపల్ కార్యాలయాల ముందు ఆందోళనలు నిర్వహించారు.

Janasena strategy for 2024 elections
Janasena strategy for 2024 elections

ప్రజల మద్దతు కూడగట్టాలంటే ప్రజల భాగస్వామ్యంతోనే పోరాటాలు చేయాలన్న సూక్తిని జనసేన నేతలు ఇపుడు ఆచరణలోకి తీసుకొస్తున్నారు.అలాగే మహిళా సాధికారత, మహిళా ఆర్ధికాభివృద్ధే ధ్యేయంగా తూర్పుగోదావరి జిల్లాలోని రంపచోడవరం గిరిజన ప్రాంతాల్లో వీరమహిళా నేతలు విస్తృతంగా పర్యటించారు. అంటే హోలు మొత్తంమీద చూస్తే అర్ధమవుతున్నదేమంటే రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ నేతలు, వివిధ కమిటిలు ఒక్కసారిగా జోరు పెంచాయని. ఇదే పద్దతిని భవిష్యత్తులో కూడా కంటిన్యుచేస్తే కచ్చితంగా జనాల మద్దతు కూడదీసుకోవటం పెద్ద కష్టమేమీకాదు.

పైగా రాబోయేదంతా ఎన్నికలకాలమే కాబట్టి ప్రభుత్వంపై పోరాటాలకు జనసేనకు అవకాశాలు కూడా బాగా ఎక్కువగా ఉంటాయి. తమ కోసం పోరాటాలు చేసేవారినే జనాలు కూడా గుర్తుంచుకుంటారు. ఈ మౌళిక సూత్రాన్ని మరచిపోయిన కారణంగానే తెలుగుదేశంపార్టీకి దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ఫలితంతో సంబంధంలేకుండా ప్రజాందోళనలను నిర్వహించటమే రాజకీయపార్టీలు చేయాల్సింది. తమను నమ్ముకున్న వాళ్ళని ఎప్పుడూ ప్రజలు మోసం చేయరు. ప్రజలను మోసం చేసిన నేతలున్నారేమో కానీ ప్రజల చేతిలో మోసపోయిన నేతలెక్కడా లేరు. పవన్ ఈ సూత్రాన్ని నిజాయితీగా ఫాలో అయితే చాలు ప్రజలే నెత్తిన పెట్టుకుంటారు.