Beauty Tips : ముఖంపై మొటిమలు, మచ్చలు తొలగి పోవాలంటే..?

Beauty Tips  : సాధారణంగా ముఖం పై మొటిమలు మచ్చలు వచ్చినప్పుడు కొన్ని రకాల జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. చాలామంది అందంగా ఉండడానికి ఎక్కువగా బయట ఉత్పత్తులను కొనుగోలు చేయడం కంటే ఇంట్లో తయారు చేసిన ఉత్పత్తులను ఫేస్ ప్యాక్ గా వేసుకునేవారు. అందుకే వారు ఎలాంటి ఖర్చు లేకుండా చాలా అందంగా చూడముచ్చటగా కనిపించేవారు. మీరు కూడా ఎటువంటి ఖర్చు లేకుండా కేవలం ఇంట్లో లభించే వస్తువులతో అందంగా మారాలి అంటే కేవలం కొన్ని రకాల జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది అని చెబుతున్నారు సౌందర్యనిపుణులు. ఇకపోతే ముఖం పై వచ్చిన మొటిమలను.. మొటిమల కారణంగా వచ్చిన మచ్చలను దూరం చేయాలంటే ఏం చేయాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం.అందం పెంపొందించుకోవడానికి ముఖ్యంగా కొన్ని రకాల స్కిన్ కేర్ పదార్థాలు అందుబాటులో వున్నాయి.

Beauty Tips To get rid of pimples and scars on the face
Beauty Tips To get rid of pimples and scars on the face

విటమిన్ సీ : విటమిన్ సి ఆరోగ్యానికే కాదు చర్మాన్ని అందంగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది. ముఖ్యంగా విటమిన్ సి లో యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల చర్మాన్ని తాజాగా ఉంచటంతోపాటు ఫ్రీ రాడికల్స్, పొల్యూషన్ తో పోరాడి చర్మాన్ని కాపాడుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు విటమిన్ సి ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి.

హ్యాలురోనిక్ ఆసిడ్ : దీనిని ఎక్కువగా సీరమ్స్, మాయిశ్చరైజర్ వంటి మొదలైన వాటిలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది చర్మాన్ని పొడిబారకుండా ఉంచుతుంది. అదే విధంగా చర్మానికి మాయిశ్చరైజ్ చూస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల చర్మాన్ని బాగా ప్రొటెక్ట్ చేస్తుంది. ముఖ్యంగా దుమ్ము , ధూళి, కాలుష్యం మొదలైన వాటి నుండి కాపాడుతుంది.

విటమిన్ ఈ : విటమిన్ ఈ అనేది ప్రస్తుతం క్యాప్సిల్స్ రూపంలో మనకు అందుబాటులో ఉంది.. దీనిని ఉపయోగించడం వల్ల ముడతలు.. మొటిమలు .. మొటిమల తాలూకు వచ్చిన మచ్చలు కూడా దూరం చేయడంలో ఈ విటమిన్ బాగా సహాయపడుతుంది. అంతేకాదు కంటి కింద ఏర్పడిన నల్లటి వలయాలను దూరం చేయడంలో కూడా సమర్ధవంతంగా పని చేస్తుందని చెప్పవచ్చు. ఇకపోతే ఇటీవల కాలంలో చాలావరకు సౌందర్య ఉత్పత్తుల లో విటమిన్ ఈ ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.