Pintu Nanda.. సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి.. ఈ క్రమంలోని మొన్నటికి మొన్న తారకరత్న మరణించగా ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో మరొక నటుడు కూడా మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.. అసలు విషయంలోకి వెళ్తే గత కొద్ది రోజులుగా కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ప్రముఖ ఒడియా నటుడు పింటూ నంద మొదట్లో భువనేశ్వర్ లో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్నారు. ఆ తర్వాత ఆయనను కాలేయ మార్పిడి కోసం న్యూఢిల్లీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలియరీ సైన్సెస్ కి తరలించి చికిత్స అందించారు. అక్కడ అవయవదాత అందుబాటులో లేకపోవడంతో ఆయనను ఢిల్లీ నుంచి హైదరాబాద్లోని యశోద ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
చికిత్స వికటించడంతో బుధవారం రాత్రి ఆయన తుది శ్వాస విడిచినట్లు వైద్యులు వెల్లడించారు. ఇకపోతే పింటు నందా మృతితో సినీ పరిశ్రమలో మరొకసారి విషాద ఛాయలు అలముకున్నాయి. హీరోగా ప్రతి నాయకుడిగా, సహనటుడిగా, హాస్యనటుడిగా ఒరియా సిని పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకున్నారు నంద. అయితే ఇప్పుడు ఆయన ఉన్నట్టుండి మరణించడం సినీ ఇండస్ట్రీని కలవరపెడుతోంది.