How to Know Rasi By Letter : మీ పేరులోని మొదటి అక్షరంతో మీ రాశి ఏంటో తెలుసుకోండిలా..

How to Know Rasi By Letter :  ఉగాది వస్తుందంటే చాలు ప్రతి ఒక్కరూ వారి రాశి ఫలాలను కచ్చితంగా తెలుసుకోవాలని అనుకుంటారు. చాలామంది వారి రాశి ఫలాలను తెలుసుకోవడానికి మక్కువ చూపుతారు. కానీ చాలా మందికి వారి రాశి ఏంటో కూడా తెలియదు మీ పేరులోని మొదటి అక్షరం నుండి మీ రాశి తెలుసుకోవచ్చు.. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..

చిన్న ఉదాహరణ ముందుగా మీ పేరు శ్రీదేవి అయితే ‘శ్రీ’ లో ‘ర’ రకారానికి స్త్రీలో ఈకారం కలుపుకొని ‘రీ’గా తీసుకోవాలి. అదేవిధంగా సత్యవతిలో ‘స’ ను ‘సా’ గా తీసుకోవాలి. ఈ విధంగా మీ పేరులోని మొదటి అక్షరం ఉపయోగించి మీరే మీ రాశి తెలుసుకోవచ్చు.

మీ పేరులోని మొదటి అక్షరం ఈ అక్షరాలతో మొదలైతే అవే మీ రాశి.
మేష రాశి: చూ,చే, చో,లా, లీ, లు, లే, లో, ఆ.
వృషభ రాశి: ఈ, ఊ, ఏ, ఓ, వా, వి, వూ, వే, వో.
మిధున రాశి: కా, కి, కే, జ్ఞ, కూ,‌ఖం, కో, హా.
కర్కాటక రాశి : హి, హే, హూ,హో, డా, డీ, డూ, డే, డో.
సింహరాశి: మా,మి, మూ, మే,మో, టా, టీ, టూ, టే.
కన్యారాశి: టో, పా, పి, పూ, షం, ణా , ఠా, పే, పో.

తులా రాశి: రా, రీ, రూ, రే, రో, తో,తీ,తూ,తే.
వృశ్చిక రాశి: తో, నా,నీ,ను,నే, నో,యా, యీ, యూ.
ధనస్సు రాశి: బా,బి, బూ, బే, రా, భా,ఢా, యే,తో.
మకర రాశి: బో, జా,జి, జూ, జే,జో, ఖా, గా,గీ.
కుంభరాశి: గూ,గే, గో, సి,సీ, సూ, సే, సో, దా.
మీన రాశి: దీ, దు, శ్యం, ఝా,ధా, దే, దో, చా,చి.