Manchu Manoj..తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచు కుటుంబానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది.. ఇక వీరి కుటుంబం గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పవచ్చు. మోహన్ బాబు రెండవ కుమారుడు మంచు మనోజ్ ఈ రోజున వివాహం చేసుకోబోతున్నారు. అందుకు సంబంధించి గడిచిన కొద్ది రోజుల క్రితం నుంచి వార్తలు వైరల్ గా మారుతూనే ఉన్నాయి. మంచు కుటుంబం పైన ఎప్పుడూ ఏదో ఒక విధంగా ట్రోల్ ఎదురవుతూనే ఉంటుంది. ముఖ్యంగా సినిమాల పరంగా వ్యక్తిగత విషయాల పైన కూడా పలు రకాలుగా ట్రోల్ అయిన సందర్భాలు ఉన్నాయి.
ఇదిలా ఉండగా మనోజ్ వైవాహిక జీవితంలో.. గడచిన కొంతకాలంగా ఒంటరిగా మిగిలిపోయారు. తాజాగా మంచు ఫ్యామిలీ హీరో మనోజ్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది. మంచు మోహన్ బాబు ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. హీరో మంచు మనోజ్ పొలిటికల్ లీడర్ భూమా నాగిరెడ్డి , శోభ నాగిరెడ్డి ల కూతురు భూమా మౌనిక తో వివాహం ఈరోజు 8:30 నిమిషాలకు హైదరాబాదులో జరగబోతోంది. వీరిద్దరికి ఇది రెండవ వివాహం. ఈ వేడుకకు కొంతమంది బంధుమిత్రులు , స్నేహితులు మాత్రమే హాజరవుతున్నట్లు సమాచారం. పెళ్లి పనులకు సంబంధించి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.