గత కొన్నాళ్లుగా స్టార్ హీరోయిన్ ఇలియానా గురించిన అనేక వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఆమె ప్రగ్నెంట్ అయిన నటి నుండి ఆమె పలు రకాలుగా ట్రోల్స్ కి గురవుతున్నారు. ఇక తాజాగా ఇల్లు బేబీ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి విదితమే. ఇలియానా తనకు కాబోయే భర్త సెబాస్టియన్ లారెంట్ మిచెల్‌తో సహజీవనం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే గర్భం దాల్చిన ఇలియానా.. ఈ ఆగస్టు 1న మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించింది.
ఈ క్రమంలో ఆమె తన కొడుకు ఫోటోను షేర్ చేస్తూ.. పేరును రివీల్ చేసేసింది కూడా. ‘‘మా ప్రియమైన అబ్బాయి ‘కోవా ఫీనిక్స్ డోలన్’ను పరిచయం చేస్తున్నాను. మా హృదయాలను దాటి ప్రపంచానికి పరిచయం చేస్తున్నందుకు ఎంత ఆనందంగా ఉన్నామో మటల్లో చెప్పలేము.” అంటూ తన సంతోషాన్ని షేర్ చేసుకోగా నెటిజన్లనుండి విశేష స్పందన వచ్చింది. ఫ్యాన్స్, నెటిజన్స్, తోటి కళాకారులు ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు. ఇక ఆమె తాను తల్లిని కాబోతున్నట్లు గతంలో కూడా ఇన్ స్టా వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇక అప్పటి నుంచి కూడా తన బేబీ బంప్ ఫోటోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లతో టచ్‌లోనే ఉంది ఈ అరేబియన్ గుర్రం. అయితే అప్పటికీ కూడా ఇలియానాకు పెళ్లి కాకుండానే తల్లి అవుతున్నట్లు ప్రకటించడంతో అభిమానులు ఒకింత షాక్ కి గురయ్యారు. ఆ తర్వాత కూడా చాలా రోజులు తనకు కాబోయే భర్త గురించి చెప్పకుండా దాచిన ఇలియానా.. కొద్దిరోజుల క్రితం అతడిని అభిమానులకు పరిచయం చేసింది. దాంతో ఆమె ప్రగ్నెంట్ కి గల కారణం ఎవరో తెలిసిపోయింది. అయితే ఇక్కడ ఎవ్వరికీ తెలియని విషయం ఏమంటే ఆమె కొన్నాళ్ల క్రితమే బాయ్ ఫ్రెండ్ సెబాస్టియన్ లారెంట్ మిచెల్‌ను అతికొద్దిమంది సమక్షంలో చాలా సీక్రెట్ గా వివివాహం చేసుకుందట. ఆ విషయం తాజాగా బయటపడింది.
కాగా ఇలియానా బిడ్డకు జన్మనివ్వడంతో బాలీవుడ్ నటీనటులు పెద్ద ఎత్తున తమ శుభాకాంక్షలు తెలిపారు ఇలియానాకు. సమంత, మలైకా అరోరా, అర్జున్ కపూర్, నర్గీస్ ఫక్రీ, అతియా శెట్టి, కరణ్‌వీర్ శర్మ, శృతి హాషన్, సోఫీ చౌదరి, హుమా ఖురేషీతో సహా అనేకమంది ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక చాలా కాలంగా టాలీవుడ్‌కు దూరంగా ఉన్న ఈ గోవా బ్యూటీ.. బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారిన సంగతి విదితమే. ఆ తర్వాత కూడా అనుకోకుండా సినిమాలకు దూరంగా ఉంది. చివరిసారిగా 2021లో అభిషేక్ బచ్చన్ నటించిన బిగ్ బుల్ లో కనిపించింది.