Dream : కలలో ఈ జంతువు కనిపిస్తే సంపద పెరిగినట్టే..!!

Dream : సాధారణంగా ప్రతి ఒక్కరూ నిద్రలోకి జారుకోవడం చాలామందికి ఎన్నో కలలు వస్తాయి. అయితే కొన్ని కలలు శుభానికి సంకేతమైతే .. మరికొన్ని కలలు అశుభానికి సంకేతం అని చెప్పవచ్చు. అయితే ఏవైనా తెల్లవారుజామున వస్తే విధంగా అవి నెరవేరుతాయని మన పెద్దలు చెబుతూ ఉంటారు. ముఖ్యంగా పదేపదే వస్తూ ఉంటే ఏదైనా చెడు జరుగుతుంది అని చాలా మంది భయపడతారు. కానీ అందులో భయపడాల్సిన అవసరం లేదు. అయితే ముఖ్యంగా మన కలలో ఈ నాలుగు రకాల జంతువులు కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా కలలు నిజమవుతాయి అని చెప్పడంలో సందేహం లేదు.

1. గుడ్లగూబ : సాధారణంగా గుడ్లగూబ కలలోనే కాదు నిజంగా కనిపించినా చాలామంది అపశకునం అనడమే కాదు చాలామంది భయపడతారు కూడా.. గుడ్లగూబ అరుపులు విన్నా కూడా ఏదో చెడు జరుగుతుందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తారు. కానీ గుడ్లగూబ లక్ష్మీదేవికి వాహనం కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. అంతే కాదు అమ్మవారి అనుగ్రహం లభించి కచ్చితంగా సిరి సంపదలు పెరుగుతాయి అని పండితులు చెబుతున్నారు.

If this animal is seen in a dream, wealth will increase
If this animal is seen in a dream, wealth will increase

2. ఏనుగు : కలలో మీకు ఏనుగు గనుక దర్శనమిస్తే మీ దశ తిరుగుతుందని అర్థం చేసుకోవాలి. ఇక ఏదో రూపంలో మీకు ధనం వస్తున్నట్లు గుర్తించాలి. ఇక ఎవరైనా సరే త్వరలో ధనవంతులు కాబోతున్నారని..ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవని అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ఏనుగులు మీరు ప్రతిసారి మీ కలలో చూసినట్లయితే పట్టిందల్లా బంగారమే అవుతుంది.

3. ఆవు : సకల దేవతలు కొలువై ఉన్న ఆవును మనం కలలో చూసినట్లయితే కచ్చితంగా దేవుడి కరుణ మీపై ఉన్నట్లు గుర్తించాలి. ముఖ్యంగా ఆవు కనిపించింది అంటే చాలు ఆ సమయంలో మీరు చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారని అర్థం. ముఖ్యంగా ఆవు అనేది మహా విష్ణువు అవతారం.

అలాగే శ్వేత నాగు కనిపించినా కూడా మీకు అదృష్టం కలిసివస్తుందని చెప్పవచ్చు.