Health Benefits : పిస్తా తో ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే..?

Health Benefits : ప్రతిరోజు ఖాళీగా ఉన్న సమయంలో చిరుతిండ్లు తింటూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ఎంతో మంది ఎన్నో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఎవరైతే సాయంత్రం వేళలో అధికంగా చిరుతిళ్ళు తింటున్నారో అలాంటి వారు ఎక్కువగా పిస్తా తింటే శరీరానికి ప్రయోజనాలు కూడా అంతే స్థాయిలో చేకూరుతాయని ఆహార నిపుణులు తెలియజేస్తున్నారు. సాయంత్రం వేళ స్నాక్స్ రూపంలో చిరుతిళ్ళు తినాలి అనిపిస్తే గింజలు తినడం వల్ల ఎన్నో లాభాలు పొందుతారు. ప్రతి రోజు వాటిని తినడం వల్ల మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వైద్యులు సైతం చెబుతున్నారు.

ముఖ్యంగా పిస్తా గింజలు తినడం వల్ల కార్బోహైడ్రేట్లు, క్యాలరీలు , పొటాషియం, ఫైబర్, ప్రోటీన్, బి విటమిన్స్, రాగి, థయామిన్ , మాంగనీస్ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇక ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు వల్ల గుండె సంబంధిత వ్యాధులు కూడా దూరమవుతాయి. ఫైబర్ , మినరల్స్ పుష్కలంగా లభించడం వల్ల రక్తంలో ప్రెజర్ , షుగర్, కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచుకోవచ్చు. ఫైబర్, ప్రొటీన్లు పిస్తా లో పుష్కలంగా లభించడం వలన కడుపు నిండిన భావన కూడా కలుగుతుంది.బరువు తగ్గడానికి పిస్తా చాలా బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఎవరైతే బరువు తగ్గాలని ప్రయత్నం చేస్తున్నారో అలాంటి వాళ్ళు తమ డైట్ లో చేర్చుకోవడం వల్ల మరిన్ని ఫలితాలు పొందవచ్చు.

Health Benefits in Pista 
Health Benefits in Pista

పిస్తా లో లభించే పోషకాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించుకోవచ్చు. డయాబెటీస్ వారికి చక్కటి స్నాక్స్ అని చెప్పవచ్చు. ఇక ఆరోగ్యకరమైన గుండె పని తీరును మెరుగుపరచడంలో పిస్తా చాలా బాగా పనిచేస్తుంది. ఇక నాడీవ్యవస్థను సురక్షితంగా ఉంచడంలో సమర్ధవంతంగా సహాయపడుతుంది. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని మెరుగు పరచడం వల్ల రక్తహీనత సమస్య తొలగిపోతుంది. అంతేకాదు కంటి చూపు మెరుగుపడుతుంది . జీర్ణక్రియ సంబంధిత సమస్యలను దూరం చేసుకోవడం మాత్రమే కాదు సుఖ విరోచనం కూడా అవుతుంది. ఇక ఆరోగ్యకరమైన జుట్టు కూడా మీ సొంతం అవుతుంది.