Lakshmi Devi : దోషాలు తొలిగిపోయి.. లక్ష్మీదేవి పెరగాలంటే..?

Lakshmi Devi : మరో రెండు రోజుల్లో అనగా మే 22వ తేదీ నుంచి జ్యేష్ట మాసం ప్రారంభం కానుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం సంవత్సరంలో 3 వ నెలగా పరిగణించబడుతుంది. ఈ నెలలో ప్రధానంగా సూర్యభగవానుడిని, హనుమంతుడిని ప్రత్యేకంగా పూజించడం జరుగుతుంది. ముఖ్యంగా జ్యేష్ట మాసం లో హనుమంతుడు తన ప్రియమైన శ్రీ రాముడిని కలుసుకున్నాడు అని పురాణాలు చెబుతున్నాయి. ఇక అంతే కాదు ఈ మాసంలోనే సూర్యుడు స్థాయి తారాస్థాయికి చేరుతుంది అని సూర్యుడి యొక్క జ్యేష్టత రీత్యా దీనిని జ్యేష్ట మాసం అని పిలుస్తారు. ఇక పోతే ఈ మాసంలో దానధర్మాలు చేయడం శ్రీమహావిష్ణువును.. లక్ష్మీదేవితో కలిపి పూజించడం వల్ల వీరిద్దరి అనుగ్రహం మనపై ఉంటుంది అని ప్రజల ప్రగాఢ విశ్వాసం.ముఖ్యంగా జ్యేష్ట మాసంలో గ్రహ దోషాలను పోగొట్టుకోవడానికి సరైన సమయం అని చెప్పవచ్చు.

ఎందుకంటే ఎవరైనా గ్రహ దోషాల కారణంగా ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ ఈ మాసంలో ఖచ్చితంగా కొన్ని పనులు చేయడంవల్ల గ్రహదోషాలు నుంచి విముక్తి పొందవచ్చు అని వేదపండితులు తెలియజేస్తున్నారు. మరి గ్రహదోషాలు పోగొట్టుకోవడానికి జ్యేష్ఠ మాసంలో మనం చేయవలసిన పనులు ఏమిటో ఎప్పుడో ఒకసారి చదివి తెలుసుకుందాం.సూర్యుడి ఆరాధన ఎల్లప్పుడూ శుభానికి సంకేతం. ఈ మాసంలో బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి నారాయణుడిని , లక్ష్మీదేవిని ధ్యానించాలి. స్నానం చేసిన తర్వాత సూర్యభగవానుడికి నీటిని అర్పించాలి. కలశం లో నీళ్లు పోసి దానికి ఎర్రటి అక్షింతలు వేసి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల పూజ చేసిన వ్యక్తి సమస్యలు తొలగిపోయి సానుకూలతలు ఏర్పడతాయి .ఇక వ్యక్తి గౌరవం పెరుగుతుంది.. మంచి ఉద్యోగం లభిస్తుంది.. ఆర్థిక సంపద రెట్టింపవుతుంది.

If the bugs are removed Lakshmi Devi should grow
If the bugs are removed Lakshmi Devi should grow

ఇక నువ్వులను జ్యేష్టమాసంలో ఇతరులకు దానంగా ఇవ్వడం వల్ల సమస్యలు తొలగిపోతాయి. జంతువులకు, పక్షులకు నీటిని ఏర్పాటు చేయాలి. ఎందుకంటే జ్యేష్ట మాసం లో ఉష్ణోగ్రతలు తారాస్థాయికి చేరుకున్న నేపధ్యంలో పశువులకు, పక్షులకు దాహం తీరక మరణించే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మీరు వాటి దాహార్తిని తీర్చడానికి కుండలను లేదా నీటిని నిల్వ ఉంచిన గిన్నెలను టెర్రస్ పైన లేదా చెట్ల పైన లేదా ప్రహరి గోడ పైన మీరు ఏర్పాటు చేసినట్లయితే పక్షుల దాహార్తి తీరుతుంది. అవసరమైతే మీ ఇంటికి కొద్దిగా దూరంలో చిన్నపాటి తొట్టెలను ఏర్పాటు చేస్తే వీధి కుక్కలకు మరే ఇతర జంతువులకు కూడా దాహార్తిని తీర్చవచ్చు. ఇలా చేస్తే సూర్యభగవానుడు హనుమంతుడు మనపై అనుగ్రహం నుంచి మనకి సకల సంపదలు ఇస్తారు అని పండితులు చెబుతున్నారు.