Health Problems : అరటి పండ్లతో ఈ సమస్యలను నివారించవచ్చా..?

Health Problems : ఇటీవల కాలంలో చాలా మంది స్థూలకాయం సమస్యతో బాధ పడుతున్న విషయం తెలిసిందే.. ముఖ్యంగా వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఇలా ఉబకాయం సమస్యతో బాధ పడుతూ ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇకపోతే ఊబకాయాన్ని తగ్గించడానికి పలురకాల డైట్ లు కూడా ఫాలో అవుతున్నారు. అయితే ఎన్ని ప్రయోగాలు చేసినా బరువు మాత్రం తగ్గడం లేదు. కానీ కొన్ని రకాల పండ్లు మాత్రం బరువు తగ్గించడంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయని నిపుణులు తెలియజేస్తున్నారు. అటువంటి పండ్లను మనం ప్రతిరోజు తినడం వలన ఆకలి కూడా తగ్గుతుంది. ఫలితంగా బరువు తగ్గవచ్చు.

అంతే కాదు కొన్ని రకాల అవసరమైన పోషకాలను కూడా పొందవచ్చు.ముఖ్యంగా బరువు తగ్గడంలో అరటిపండ్లు సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇక తక్కువ ధరకు లభించే అన్ని సీజన్లలో కూడా సులభంగా దొరుకుతుంది. క్యాల్షియం అధికంగా ఉండే అరటిపండు రెండు లేదా మూడు గంటల వరకు ఆకలిని అదుపు చేస్తుంది. ఇక అరటిపండు తినడం వల్ల కడుపు నిండిన భావన కలగదు. ఇతర ఆహారం పై వ్యామోహం వెళ్లకపోవడం లాంటివి జరుగుతాయి. అరటిపండు తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయానికి వస్తే అరటి పండులో పుష్కలంగా పోషకాలు లభిస్తాయి.

Health Problems be prevented with Bananas
Health Problems be prevented with Bananas

ప్రొటీన్లు, విటమిన్లు లభించడం వల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ముఖ్యంగా ఇందులో ఉండే స్టార్చ్ జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది.బరువు తగ్గడంతో పాటు ఎముకలలో నొప్పి ఉంటే ఈ పండును తినడం వల్ల త్వరగా ఎముకలలో నొప్పి దూరం అవుతుంది. అంతే కాదు ఎముకలకు కావలసిన కాల్షియం లభించి ఎముకలు దృఢంగా తయారవుతాయి. ఇక చిన్న పెద్ద ఎవరైనా సరే అరటి పండ్లు తినవచ్చు అరటి పండ్లు తినడం వల్ల జీర్ణాశయ పనితీరు మెరుగు పడి జీర్ణ సంబంధిత సమస్యలు దూరమవుతాయి . అంతేకాదు మలబద్దక సమస్యను కూడా తగ్గించుకోవచ్చు.