ఖరీదైన వస్తువులు పోయాయా.. అయితే ఈ అమ్మవారిని పూజించాల్సిందే..!!

Worship : ఇటీవల కాలంలో మనుషులు చాలా స్వార్ధపరులు గా మారిపోయారు . ఎవరికైనా ఆపద వచ్చినప్పుడు లేదా ఏదైనా విలువైన వస్తువు పోయినప్పుడు మాత్రమే దేవుడిని ప్రార్థిస్తున్నారు. అంతే తప్ప మిగతా సమయాలలో వారికి దేవుడిని పూజించడానికి కూడా సమయం లేకుండా పోతోంది. ఇక నిజానికి ఆపద వచ్చినప్పుడు దేవుడికి బాధలన్నీ చెప్పుకొని ఉపశమనం కల్పించాలని కోరుకుంటూ ఉంటారు. అయితే తీరుతాయో లేదో అనే విషయం పక్కన పెడితే చాలామందికి దేవుడు కోరికలు తీరుస్తాడు అని భక్తులు నమ్మకం మాత్రం గట్టిగా ఉంటుంది. ఇక కొన్ని ప్రాంతాలలో అమ్మవార్లకు నిజమైన శక్తులు కూడా ఉన్నాయని ఏది కోరుకుంటే అది వెంటనే తీరిపోతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం.

పెద్ద కోరికలు తీర్చే అమ్మ వారు కూడా మనకు దర్శనం ఇస్తున్నారు. ఇక అమ్మవారు తమిళనాడులో కొలువై ఉండడం గమనార్హం. తమిళనాడు రాష్ట్రంలోని రత్న మంగళం లో కొలువైన అరైకాసు అమ్మన్ అనే అమ్మవారికి మొక్కుకుంటే మాత్రం ఎంతటి కష్టమైనా సరే ఇట్టే తీరిపోతుంది. ముఖ్యంగా విలువైన వస్త్రాలు, పత్రాలు , బంగారు ఆభరణాలు లాంటివి పోగొట్టుకున్నవారు అమ్మవారిని అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రార్థిస్తే ఖచ్చితంగా అవి దొరుకుతాయని భక్తుల విశ్వాసం. అమ్మవారికి ఈ పేరు ఎలా వచ్చింది అనే విషయం గురించి ఒకసారి తెలుసుకుందాం..పుదుక్కోట దగ్గరున్న గోకర్ణంలో ప్రగడాంబల్ అనే అమ్మవారు కొలువు తీరి పూజలు అందుకుంటోంది.

Worship these goddesses even if the expensive items are gone
Worship these goddesses even if the expensive items are gone

ఒకసారి విజయనగరాన్ని పాలిస్తున్న రాజు ముఖ్యమైన పత్రాన్ని పోగొట్టుకోవడం తో ఎంత వెతికినా దొరకలేదు. అందుకే అమ్మవారిని ప్రార్థించారు .. ఇక పత్రం దొరికితే సంతోషించిన రాజు అమ్మ వారికి కృతజ్ఞతలు తెలిపి ఆవిడ రూపాన్ని అరకాసు విలువైన నాణెంపై ఒకవైపు ముద్రించి.. వాటిని ప్రత్యేక దినాలలో , పండుగ రోజుల్లో ప్రజలకు పంచేవారు. ఆ తర్వాత మరెన్నో సంఘటనలు ఇలా చోటుచేసుకోగా అమ్మవారు నిజస్వరూపం లో వారికి ఆ విలువైన వస్తువులను తిరిగి ఇచ్చిందట. వీరే కాదు ఎంతో మంది భక్తులు కూడా తమ విలువైన వస్తువులను తిరిగి పొందుతున్నారు. కాబట్టి మీరు కూడా ఏదైనా విలువైన వస్తువులు పోగొట్టుకున్నట్లూ అయితే ఈ అమ్మవారిని ఒకసారి సందర్శించండి. ప్రతి ఒక్కరికి అవసరమైన ఇలాంటి ఆర్టికల్ను వాట్సాప్ లేదు ఫేస్ బుక్ ద్వారా షేర్ చేయండి.