ఫోన్ చేసి మహేష్ అలా మాట్లాడుతాడని అనుకోలేదు: ఎమోషనల్ అయిన యాంకర్ సుమ..

గలగలా మాట్లాడుతూ తెలుగు బుల్లితెరపై సూపర్ పాపులర్ అయింది యాంకర్ సుమ. మొదటగా సినిమాల్లో కనిపించిన సుమ తర్వాత యాంకర్ గానే సెటిల్ అయ్యింది. సినిమా ఫంక్షన్లను కూడా తన మాటకారితనంతో ఎంటర్‌టైనింగ్‌గా మార్చగల సామర్థ్యం సుమకి ఉంది. ఇంకా సుమ వాక్చాతుర్యం గురించి ఎంత చెప్పినా తక్కువే. చిరంజీవి అంతటివాడే తాను సుమకి అభిమానిని గర్వంగా చెప్పుకున్నాడంటే ఆమె టాలెంట్ ఎంతో అర్థం చేసుకోవచ్చు.

ఇక చాలా రోజుల తర్వాత సుమ జయమ్మ పంచాయితీ సినిమాతో వెండితెరకు మంచి కమ్‌బ్యాక్ ఇచ్చింది. 2022 మే 6వ తారీఖున రిలీజ్ అయిన ఈ సినిమా పర్లేదు అనిపించింది. సుమ పర్ఫామెన్స్ ని చాలామంది పొగిడారు కూడా. అయితే ఈ సినిమాని మహేష్ బాబు కూడా చూశాడట. ఈ విషయాన్ని తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సినిమా వెల్లడించింది. ఒకరోజు మహేష్ బాబు నుంచి తనకు కాల్ వచ్చిందని.. అది చూసి తాను ఎంతో సంతోషంగా ఫీల్ అయ్యానని తెలిపింది.

తర్వాత ఆ ఫోన్‌ లో మహేష్ మాట్లాడుతూ “సుమ గారు బాగున్నారా? మీ జయమ్మ పంచాయతీ సినిమాని ఇటీవల చూశాను. సినిమా చాలా బాగుంది మీ పర్ఫామెన్స్ ఇంకా బాగుంది. ఇంకా మీరు మంచి రోల్స్ చేయాలని కోరుకుంటున్నా” అని అన్నట్లు సుమ తెలిపింది. అసలు మహేష్ ఫోన్ కాల్ చేయడమే గొప్ప విషయం అనుకుంటే, అతను తనని ఎంతో పొగిడాడని చెబుతూ సుమ సంతోషాన్ని వ్యక్తపరిచింది. సూపర్ స్టార్ అయ్యుండి, నేను తీసిన చిన్న సినిమా చూసి, అది బాగుందని తనకు ఫోన్ చేసి చెప్పడం నిజంగా అతని గొప్పతనానికి నిదర్శనం అని సుమ చెప్పుకొచ్చింది. కాగా సుమ కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి.