మహేష్ బాబు ఇంటిలో హీరో సూర్య… విషయం అదే అయ్యుంటుందా?

కోలీవుడ్లో రజనీ, కమల్, విజయ్, అజిత్ తర్వాత ఆ స్థాయిలో క్రేజ్ ఉన్న మరో నటుడు ఎవరంటే మనకు ముందుగా గుర్తొచ్చేది సూర్యనే. తమిళంలో సూర్యకు ఎంత పాపులారిటీ ఉందో తెలుగులో కూడా అంతే ఉంది. ఆయనకి ఇక్కడ చాలా ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఇక సూర్య సినిమాలు రిలీజవుతున్నాయంటే తెలుగు ప్రేక్షకులు కూడా చాలా ఉత్సుకతతో ఎదురు చూస్తూ వుంటారు. అయితే గత కొంత కాలంగా సూర్య సినిమాలు కమర్షియల్‌గా హిట్ కావడం లేకపోవడం వలన అభిమానులు చాలా నిరాశతో వున్నారు. సూర్య నుండి ఒక గజనీ లాంటి సినిమా ఎప్పుడెప్పుడొస్తుందాని ఎదురు చూస్తున్నారు.

ఇక గతేడాది భారీ అంచనాల మధ్య రిలీజైన ఈటీ తొలిరోజే నెగెటీవ్ టాక్ తెచ్చుకుని డిజాస్టర్‌ ఫలితం మూటగట్టుకుంది. అయితే తాజాగా సూర్య ‘కంగువా’ అనే పీరియాడిక్ సినిమాలో నటిస్తున్నాడు. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో సూర్యను సరికొత్త అవతారంలో అభిమానులు చూడనున్నారు. దిశా పటానీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చడం విశేషం. యూవీ క్రియేషన్స్‌, స్టూడీయో గ్రీన్‌ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఆ సంగతి కాస్త పక్కన బెడితే సూర్య, మహేష్ బాబు గురించి ఓ వార్త సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ వచ్చిన సూర్య మరియు జ్యోతిక దంపతులు హీరో మహేష్ బాబు ఇంటికి వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. కాగా వారిని మహేష్ అండ్ నమ్రత దంపతులు చాలా వినమ్రంగా ఇంట్లోకి ఆహ్వానించినట్టు తెలుస్తోంది. విషయం దేవుడికెరుకగానీ, వీరి మీటింగ్ తరువాత ఏవేవో ఊహాగానాలు సోషల్ మీడియాలో బయలుదేరాయి. త్వరలో వీరు ఇద్దరు కలిసి ఒక మల్టీ స్టారర్ సినిమా చేయబోతున్నారు గుసగుసలు వినబడుతున్నాయి.

ఈ విషయాలు విన్న మహేష్ బాబు అభిమానులు మరియు సూర్య అభిమానులు పండగ చేసుకుంటున్నారు. చాలా సంవత్సరాల తరువాత ఓ బడా కాంబో రాబోతోందని వారు అభిప్రాయపడుతున్నారు. లోగుట్టు పెరుమాళ్ళకెరుకగానీ, వీరిద్దరి కలయికలో ఓ సినిమా వస్తే మాత్రం ఇరు సౌత్ పరిశ్రమలక్లు ఓ భారీ హిట్ రాబోతోంది అనేది నగ్న సత్యం. అందుకే ఈ వార్త నిజమవ్వాలని కోరుకుందాం. ఇకపోతే మహేష్ బాబు ప్రస్తుత సినిమా గురించి అందరికీ తెలిసిందే. త్రివిక్రమ్ – మహేష్ కాంబోలో తెరకెక్కుతున్న ‘గుంటూరు కారం’ సినిమాపైన గట్టి అంచనాలే వున్నాయి.