Hyper Adi: హైపర్ ఆది కి MLAటికెట్ అని తెలిసి .. జనసేన కి ముగ్గురు రాజీనామా !

Hyper Adi: జబర్దస్త్ స్టేజిపై పర్ఫెక్ట్ కామెడీ టైమింగ్ తో అదిరిపోయే పంచులు వేస్తాడు హైపర్ ఆది .. బుల్లితెరపై తన కంటూ ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకుని వెండి తెర దాకా అడుగులేశాడు హైపర్ ఆది.. ఇప్పుడు అదే నటుడు పాలిటిక్స్ వైపు చూస్తున్నాడు.. స్టేజ్ ఎక్కి స్పీచ్ దంచేసాడు.. వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధమంటూ సంకేతాలు ఇస్తున్నాడు.. ఈ విషయం తెలిసిన జనసేన నాయకులు రాజీనామాకు సిద్ధమయ్యారు..

Hyper adi have MLA ticket confirm on janasena leaders take a against decision
Hyper adi have MLA ticket confirm on janasena leaders take a against decision

హైపర్ ఆది స్వస్థలం ప్రకాశం జిల్లా చీమకుర్తి. బుల్లితెరపై కామెడీ ప్రోగ్రాం తో మెగా ఫ్యామిలీకి దగ్గరైన హైపర్ ఆది.. ఇప్పుడు రాజకీయాల వైపు చూస్తున్నాడు. గత ఎన్నికల్లో జనసేన తరఫున నాగబాబుతో కలిసి ప్రచారం చేశాడు. క్రిష్ దర్శకత్వంలో వస్తున్న హరిహర వీర ముల్లు సినిమాలో ఆది కూడా ఒక పాత్రలో కనిపిస్తున్నాడు. ఆ షూటింగ్ సమయంలోనే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి ఆది మరింత దగ్గర అయ్యాడు. ఇప్పుడు ఆ చొరవతోనే ఆదిని జనసేన వేదిక ఎక్కేలా చేసింది.

 

జనసెన స్టేజ్ పై ప్రత్యేకంగా పావు గంటసేపు స్పీచ్ ఇచ్చాడు. ఆది వాక్చాతుర్యానికి పవన్ కళ్యాణ్ కూడా ఆనందించడం అక్కడున్న అందరూ గమనించారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసుకొని విమర్శించే వారిపై రణస్థలం స్తభలో పంచుల వర్షం కురిపించాడు. హైపర్ ఆది గతం నుంచి ఆది ఎన్నో పబ్లిక్ మీటింగ్లలో కార్యక్రమాలలో పవన్ కళ్యాణ్ పై తన అభిమానాన్ని చాటుకున్నాడు . శ్రీకాకుళం యువశక్తి మీటింగ్ లో మాత్రం ఒక అభ్యర్థిగా మాట్లాడుతున్న అన్న పదానికి అర్థాలు వేరేనంటున్నాయ్ పొలిటికల్ సర్కిల్స్ .. జనసేన అధినేత నుంచి ఎమ్మెల్యే టికెట్ కన్ఫామ్ అయినట్టు హామీ ఉండబట్టే ఆది అంత దూరం వెళ్లి ఉంటాడని అందరూ అనుకుంటున్నారు.

 

జనసేన తరపున హైపర్ ఆది ఎమ్మెల్యేగా పోటీ చేయడం కన్ఫామ్ అని తెలుసుకున్న.. జనసేన కి కీలకమైన ముగ్గురు సభ్యులు రాజీనామా చేయాలని డిసైడ్ అయ్యారట. ఎక్కడో టీ షోలలో వల్గర్ పంచులు వేసుకునే అతన్ని తీసుకువచ్చి ఎమ్మెల్యే సీటు ఇస్తానంటే.. ఊరుకోమని జనసేన సభ్యుల మధ్య అంతరంగంగా హైపర్ ఆదికి వ్యతిరేకంగా మాటలు జరుగుతున్నాయని సమాచారం. హైపర్ ఆది ఎమ్మెల్యేగా పోటీ చేయడం కావాలో మేం ముగ్గురం పార్టీలో ఉండాలో మీరే డిసైడ్ చేసుకోండి అనే వరకు మాటలు వెళ్ళయట పవన్ కళ్యాణ్ వరకు.. ఇక పవన్ నిర్ణయం ఏమిటో చూడాలి..