Veera Simha Reddy: నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ వీరసింహారెడ్డి.. ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా థియేటర్స్ లో విడుదలై ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది .. ఈ సినిమా కలెక్షన్ల బలంగా దూసుకెళ్తోంది..

ఈ చిత్రం టిఎస్ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లను కలెక్ట్ చేసింది. ఇప్పటికే యూఎస్ లో వన్ మిలియన్ కి పైగా వసూలను రాబట్టింది. ఈ చిత్రంతో బాలయ్య మరోసారి యుఎస్ లో విజయభేరి మోగించారు. యూఎస్ థియేటర్లలో కూడా బాలయ్య అంటూ నినాదాలు..
వీర సింహారెడ్డి సినిమా 3 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాలలో 50 కోట్లకు పైగా గ్రాస్ లు అందుకోగా ప్రపంచవ్యాప్తంగా 73.9 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా నాలుగవ రోజు తెలుగు రాష్ట్రాల్లో మరోసారి కలెక్షన్స్ తో హోల్డ్ చేసి దుమ్ములేపింది. 11 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్ ని సొంతం చేసుకుని.. వరల్డ్ వైడ్ గా 12 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్ ని సొంతం చేసుకుని ఇక ఆఫ్లైన్ టికెట్లు సేల్స్ బాగుంటే మరింత పెరిగే అవకాశం ఉంది.
ఈ సినిమా నాలుగు రోజులకు కాను తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 70 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్కుని అందుకుంది. ఇక వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 86 కోట్ల మార్కుని అందుకుంది . ఇక ఐదవ రోజు కూడా ఇలాగే బాలయ్య విజృంభిస్తే 100 కోట్ల క్లబ్లో పెరగడం ఖాయం . మొత్తానికి బాలయ్య బాబు 100 కోట్ల శిఖరానికి నేటితో చేరుకున్నట్టే అని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.