Husband – Wife : మనుషులు ఇంత దారుణంగా ఉన్నారా .. నడిరోడ్డు మీద భార్యతో .. ఛి ఛీ !

Husband – wife : నేటి సమాజం తీరు ఎటు పోతుందో చెప్పలేని పరిస్థితుల్లో ఉంది.. సభ్య సమాజం తలదించుకునే పనులు కొందరు చేస్తున్నారు.. మానవత్వం మంట కలిసి పోతుంది.. మిన్ను మన్ను కానకుండా వ్యవహరిస్తున్నారు.

husband attack wife on iron rod in Hyderabad
husband attack wife on iron rod in Hyderabad

.

కోపగాపాలకు సంసారాలు చిన్నాభిన్నం చేసుకుంటున్నారు.. హైదరాబాదులో తాజాగా ఓ దారుణం జరిగింది.. లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆసం నగర్ లో అందరూ చూస్తుండగానే రోడ్డుపైన భార్యని చంపిన భర్త కిరాతకంగా వ్యవహరించాడు.. వీరి సంసారం వివాదాలతోనే సాగేది.. లంగర్ హౌస్ లో మహమ్మద్ యూసఫ్ కు కరీనా బేగంతో ఏడు సంవత్సరాల క్రితం పెళ్లింది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు.

ఈ భార్యాభర్తలకు ఒక సంవత్సరం నుంచి గొడవలు జరుగుతున్నాయి..ఆ మనస్పర్ధలు కారణంగా ఇద్దరు దూరంగా ఉంటున్నట్లు వారి బంధువులు తెలిపారు . భార్య ఓ ప్రైవేటు స్కూల్లో ఉపాధ్యాయులుగా టీచర్ గా వర్క్ చేస్తుంది. ఈరోజు ఉదయం ఆమె భర్త కాపు కాసి కరీనా బేగం వెళ్తున్న దారిలో ఆమె పై దాడి చేశాడు.

కరీనా స్కూల్ కి వెళ్తున్న దారిలో ఆమెను ఐరన్ రాడ్డుతో నడిరోడ్డు మీద దాడి చేసి హతమార్చారు. పారిపోతున్న నిందితుల్ని పోలీసులకు అప్పగించారు స్థానికులు. కాగా కరీనా దాకా అక్కడికక్కడే మరణించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు. పట్టపగలు మిట్ట మధ్యాహ్నం జరిగిన హత్య కలకలం రేపింది . స్థానికులను భయపెట్టింది. పోలీసులు నిందితులను విచారిస్తున్నారు