Rocket Raghava : ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ షో ఎంతో మంది కమీడియన్స్ కి లైఫ్ ఇచ్చింది.. జబర్దస్త్ టిఆర్పి రేటింగ్ కి మరీ షో కూడా సాటి రాదు.. ఇవన్నీ ఇప్పుడు కాదు ఒకప్పుడు.. ఇప్పుడు జబర్దస్త్ కూడా నాసిరకం స్కిట్లతో పలుచనైంది.. పాత కమెడియన్స్ పోయి కొత్త కమీడియన్స్ వచ్చారు.. ఇన్ డైరెక్ట్ పంచులతో కాస్త్తో కూస్తో ఆకట్టుకుంటున్నారు.. కానీ జబర్దస్త్ నుంచి వెళ్ళిపోయిన కమిడియన్స్ మీద పంచులు వేస్తూ పబ్బం గడుపుతున్నారు. అదే విధంగా నెగిటివిటీని సొంతం చేసుకుంటున్నారు.. తాజాగా అలాంటి పనే రాకెట్ రాఘవ కూడా చేసి వార్తల్లో నిలిచారు..
9వ తేదీన ప్రసారం కాబోయే జబర్దస్త్ ప్రోమో ఒకటి ఈటీవీ విడుదల చేయగా అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ షోకి జడ్జిలుగా ఎప్పటిలాగానే కృష్ణ భగవాన్, ఇంద్రజ వ్యవహరించారు. సౌమ్య యాంకర్ .. ఓ స్కిట్లో ఒక కమెడియన్ వచ్చి రాకెట్ రాఘవ ను మంచితనం ఇన్నాళ్లు కామెంట్ లోనే చూశాను ఇప్పుడు నిజంగా కళ్ళారా చూస్తున్నాను కామెంట్లు నువ్వు రాయించు రాయించుకునే వాడివా అని అడుగుతాడు.. నిజానికి ఈ మాట స్కిట్లో అసలు సెట్ కాలేదు. దానికి రాఘవ అలా రాయించుకున్నోళ్ళు వాయించుకుని ఎప్పుడో బయటకు వెళ్లిపోయారని అంటారు..
ఇక ఈ పంచ్ కి జడ్జిలతో పాటు సౌమ్య కూడా పగలబడి నవ్వింది. రాకెట్ రాఘవ ఎప్పుడు కాస్త సెన్సిబుల్ గా మాట్లాడుతారు అని ఇన్నాళ్ళు అందరూ అనుకునే వాళ్ళు.. రాఘవ ఎవరిని కామెంట్ చేయకుండా.. ఎవరి జోలికి వెళ్లకుండా తన పని తాను చేసుకుంటున్నాడని అనుకున్నారు. కానీ వెళ్ళిపోయినా తన తోటి ఆర్టిస్టు మీద ఇలాంటి మాటలు అనడం సబబు కాదని నెటిజన్ల వాదన .
నిజానికి కామెంట్లలో తోపు సూపర్ , బంపర్ అని తరచూ సుడిగాలి సుదీర్ పేరు వినిపించేది.. దానిమీద కూడా రకరకాల జోకులు వేశారు.. వాటిని సహజ తత్వంతో లైట్ తీసుకొని తను నవ్వేసి వదిలేసి వెళ్ళిపోయారు .. ప్రస్తుతం జబర్దస్త్ షో నుంచి సుడిగాలి సుదీర్ తప్పుకున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ హీరోగా ఓ సినిమా చేసి హిట్ అందుకున్నారు..
రాయించుకున్నోళ్ళు వాయించుకుని వెళ్ళిపోయారు అని ఆ కామెంట్ యాటిట్యూడ్ చూపిస్తుందని.. ఎప్పుడో వెళ్లిపోయిన సుడిగాలి సుదీర్ మీద ఇప్పుడు ఇలాంటి మాటలు చేయడం కరెక్ట్ కాదని.. యాంకర్ గా రేష్మి ఉన్నప్పుడు ఈ మాటలు మాట్లాడినా ఒక అందం కానీ.. అక్కడ రష్మీ కాదు సౌమ్య అనే కొత్త యాంకర్ ఉంది . రాకెట్ రాఘవ సుడిగాలి సుదీర్ ను కావాలని ఇలాంటి వ్యాఖ్యలు చేశారని అనుకుంటున్నారు. ఈ వ్యాఖ్యలు చేసిన రాకెట్ రాఘవ పై సుడిగాలి సుదీర్ ఫ్యాన్స్ ఆ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. అసలు బుర్ర ఉండే రాఘవ ఈ కామెంట్స్ చేశారా.. తన తోటి ఆర్టిస్టు మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని అందరూ అంటున్నారు.