Diabetes : డయాబెటిస్ కి చెక్ పెట్టే మామిడి ఆకులు.. ఎలాగంటే..?

Diabetes : వేసవికాలం అనగానే ప్రతి ఒక్కరికి ముందుగా గుర్తొచ్చే పండు మామిడి పండు మామిడి పండు వల్ల శరీరానికి కావలసిన అన్ని పోషకాలు లభిస్తాయి అంతే కాదు వేసవికాలంలో ప్రత్యేకంగా లభించే మామిడి పండ్లు తినడం వల్ల ఆరోగ్యానికే కాదు చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవచ్చు ప్రతి ఒక్కరికి తెలిసిందే ముఖ్యంగా మామిడి ఆకులతో కూడా అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇక మామిడి ఆకులు మామిడి కాండం బెరడు వేర్లు పువ్వులు ఇలా ప్రతి ఒక్కటి కూడా మనిషి యొక్క ఆరోగ్యాన్ని పెంపొందించడానికి సహాయపడతాయి. మామిడి ఆకులతో తయారు చేసే కషాయం తాగడం వల్ల డయాబెటిస్కు చెక్ పెట్టవచ్చు.

ఇప్పుడు ఒకసారి పూర్తిగా చదివి తెలుసుకుందాం.అయితే డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నవారు మామిడి ఆకులను ఎలా తీసుకోవాలి అంటే ముందుగా ఒక రెండు ఆకులను తీసుకుని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి గ్లాసు నీళ్ళలో వేయాలి. ఇక రాత్రంతా అలాగే ఉంచి ఉదయాన్నే ఆ నీటిని వడగట్టి పాలు తాగడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఇక ఇలా వీలుకాదు అనుకునే వాళ్ళు ముందుగా నీడలో ఆకులను ఎండబెట్టి పొడి వేసుకొని ఆ పొడిని నీళ్లలో కలిపి తాగితే కూడా ప్రయోజనాలు కలుగుతాయి. ఇక మామిడి ఆకుల్లో మనకు విటమిన్లు.. ఖనిజాలు..ఎంజైములు..

How about mango leaves to check for Diabetes
How about mango leaves to check for Diabetes

లవణాలు వంటివి పుష్కలంగా ఉంటాయి. అందువలన డయాబెటిస్ ఒక్కటే కాదు.. జ్వరం, జలుబు, విరేచనాలు, నిద్రలేమి, నరాల బలహీనత, ఉబ్బసం వంటి ఎన్నో సమస్యలకు ఈ ఆకులు గొప్ప పరిష్కారం అని చెప్పవచ్చు.ముఖ్యంగా మామిడి కాండం బెరడు తో కాలిన గాయాలకు మంచి ఔషధంగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా వేసవి కాలంలో మామిడికాయలను మితంగా తినాలి లేకపోతే వేడి చేసే ప్రమాదం కూడా ఉంటుంది ఇక మజ్జిగతో కలిపి మామిడిపండు తినకూడదు.ఇలా కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మామిడిపండు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది.