Money : డబ్బులు లెక్క పెట్టేటప్పుడు ఇలా చేస్తున్నారా..ఇక అంతే..?

Money : మహాలక్ష్మీ దేవి యొక్క ఆశీస్సులు మనపై ఎల్లప్పుడూ ఉండాలి అంటే కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా డబ్బు కష్టాలను నివారించాలి అని అనుకున్నప్పుడు డబ్బులు లెక్కించే సమయంలో కూడా లేదా ఇచ్చే సమయంలో అలాగే తీసుకునే సమయంలో కూడా కొన్ని విషయాలను జాగ్రత్తగా గుర్తించాలి. లేకపోతే లక్ష్మీదేవి ఆగ్రహం చెంది మనల్ని కటిక దరిద్రుడు గా మారుస్తుంది. ఇక లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.

శ్రీ మహావిష్ణువు భార్య అయినటువంటి లక్ష్మీదేవి సంపదకి దేవతగా ప్రతి ఒక్కరు పరిగణిస్తారు. మరి ఇలాంటి దేవి పూజ మనం చేస్తే తప్పకుండా కీర్తితోపాటు సంపదను కూడా పొందవచ్చు. ముఖ్యంగా లక్ష్మీదేవి కొలువై ఉండే ఇంట్లో పేదరికం రాదు అని లక్ష్మి కి కోపం వస్తే మాత్రం ఎంత గొప్ప ధనవంతుడైనా సరే పేదరికాన్ని అడ్డుకోలేడని పండితులు చెబుతున్నారు. తప్పు అనేది ఎప్పుడు.. ఎక్కడ.. ఎలా.. జరిగిందో కూడా ఎవరికీ అర్థం కాదు అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఎంత కష్టపడి పని చేసినా సరే డబ్బు రాకపోగా పైగా వచ్చిన డబ్బు కూడా నిలవదు. మొత్తం నీటి లాగా ఖర్చు అవుతూ ఉంటుంది.

Doing this when calculating Money
Doing this when calculating Money

ఇక మనం రోజూ డబ్బుతో ఏదో ఒక పని చేస్తూనే ఉంటాము కాబట్టి మనకు తెలియకుండానే లక్ష్మీదేవికి కోపం వచ్చేలా ఏదో ఒక పని చేస్తూ ఉంటాము. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి కి కోపం వచ్చి మన దగ్గర నుంచి వెళ్లి పోతుంది.ఇక లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే డబ్బులు, నోట్లు ఉన్న పర్సులో తిండి పదార్థాలను ఎప్పుడూ ఉంచకూడదు. ఇక అలాగే పేద వారికి డబ్బు దానంగా ఇచ్చేటప్పుడు వాటిని పొరపాటున కూడా విసిరి వేయకూడదు. ఇలా విసరడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహం చెంది మన చేతిలో డబ్బు లేకుండా పోతుంది. ఇక కొంతమంది నోట్లు లెక్క పెట్టేటప్పుడు చేతి తో ఉమ్ము రుద్ది లెక్కిస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవికి ఆ గౌరవం కలుగుతుంది పైగా మరింత దరిద్రం చుట్టుకుంటుంది.