Hair Benefits : రణపాల యొక్క ఆరోగ్యం మరియు జుట్టు ప్రయోజనాలు

Ranapala: రణపాల.. ఈ మొక్కలు మన ఇంటి చుట్టుపక్కల పరిసరాలలో చూస్తూనే ఉంటాం..! ఈ చెట్టు ఆకులు కాస్త మందంగా ఉంటాయి.. పులుపు, వగరు కలగలిసిన రుచితో ఉంటాయి వీటి ఆకులు.. ఈ చెట్టు ఆకులులో బోలెడు ఔషధ గుణాలు ఉన్నాయి.. ప్రతి రోజు రణపాల ఆకుల కషాయం తాగితే ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం..!రణపాల ఆకులను శుభ్రంగా ఒక గ్లాస్ నీటిలో వేసి బాగా మరిగించాలి. ఆ తర్వాత ఈ నీటిని ఒక గ్లాసు లోకి వడపోసుకోవాలి.

ఇలా తయారుచేసుకున్న రణపాల కషాయాన్ని ఉదయం 30 ml మోతాదులో తీసుకుంటే కిడ్నీలో రాళ్లు, బ్లాడర్ లో ఉన్న రాళ్ళు కరిగిపోతాయి. ఈ కషాయాన్ని తాగడం వలన డయాబెటిక్ లెవల్స్ తగ్గుతాయి. ఉదయం సాయంత్రం రెండు ఆకులను తీసుకున్న కూడా షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. డయాలసిస్ రోగులకు ఈ ఆకులు అద్భుతంగా పని చేస్తాయి. రక్తంలోని క్రియాటిన్ లెవెల్స్ తగ్గిస్తాయి. ఈ ఆకులు తింటే హై బీపీ తగ్గుతుంది. జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.

Health And Hair Benefits Of Ranapala
Health And Hair Benefits Of Ranapala

రణపాల ఆకులను ముద్దగా నూరి ఆ మిశ్రమాన్ని నుదిటిపై రాసుకుంటే తలనొప్పి, మైగ్రేన్ తల నొప్పి త్వరగా తగ్గుతుంది. ఈ ఆకుల రసాన్ని ఒక్క చుక్క చెవిలో వేసుకుంటే చెవిపోటు తగ్గుతుంది. ఈ ఆకుల రసాన్ని 30ml మోతాదులో తీసుకుంటే కామెర్లు తగ్గుతాయి. రణపాల ఆకుల మిశ్రమాన్ని కొవ్వు గడ్డలు ఉన్నచోట పట్టీలాగా వేసుకుంటే అవి త్వరగా కరిగిపోతాయి. ఈ ఆకుల మిశ్రమాన్ని తలకు పట్టిస్తే వెంట్రుకలు నల్లగా మారుతాయి.