ఆరోగ్యానికి హాని కలిగించే ఆహార పదార్థాలు ఏంటో తెలుసా..?

ముఖ్యంగా మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే శరీరంలోని అన్ని అవయవాలు సరిగా పని చేయాలి. అవయవాల పనితీరు మెరుగు పడాలి అంటే అందుకు తగ్గట్టుగా పోషకాలు, ఖనిజాలు, విటమిన్లు అవసరం అవుతాయి. అందుకే ఏ వైద్యుడి దగ్గరకు వెళ్ళినా సరే ముఖ్యంగా పోషకాహారం కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవాలని సిఫార్సు చేస్తూ ఉంటారు. అలాంటి వాటిలో విటమిన్ ఏ కూడా తప్పనిసరిగా తీసుకోవాలి. ఇకపోతే మనం రోజువారి తీసుకునే ఆహార పదార్థాలలో ఎంతవరకు మన శరీరానికి పోషకాలు అందుతున్నాయి అనే విషయంపై కూడా ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి. అప్పుడే జబ్బుల బారిన పడకుండా ఆరోగ్యంగా వుండగలుగుతాము.ఇటీవల జరిగిన ఒక అధ్యయనం ప్రకారం కొన్ని ఆహార పదార్థాల వల్ల అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని వెల్లడించడం జరిగింది.. ఇక అనారోగ్య సమస్యలకు దారితీసే ఆహారపదార్థాలు ఏమిటో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

Do you know any foods that are harmful to health
Do you know any foods that are harmful to health

1. ఆల్కహాల్ : ఇటీవల కాలంలో చాలా మంది ఫంక్షన్స్ , పార్టీస్ పేరిట అలవాటు లేనివారు కూడా ఆల్కహాల్ ను అలవాటు చేసుకుంటున్నారు. మద్యం ఎక్కువగా సేవించడం వలన దీర్ఘకాలిక సమస్యలతో పాటు ఆరోగ్యం త్వరగా చెడిపోయే అవకాశం కూడా ఉంటుంది. అందుకే ఆల్కహాల్ వంటివి ఎక్కువగా సేవిస్తూ ఉన్నట్లయితే వాటిని పూర్తిగా మానివేయడం మంచిది.

2. ఉప్పు : కొంతమంది ఉప్పు అధికంగా లేనిదే వంటలు తినడానికి ఇష్టపడరు. అలాంటప్పుడు కొద్దిగ మోతాదులోనే ఉప్పు తీసుకోవాలి.. కానీ అధిక మోతాదులో తీసుకోవడం వల్ల హై బ్లడ్ ప్రెజర్ వచ్చే అవకాశాలు ఎక్కువ.

3. తీపి పదార్థాలు : కొంతమందికి కారం, ఉప్పు కంటే తీపి పదార్థాలు ఎక్కువగా తినడానికి ఇష్టం ఉంటుంది.. ఇక మీ ఇష్టం కారణంగా వారు కనిపించిన ప్రతి పదార్థాన్ని తింటూ ఉంటారు. అధికంగా తీపి పదార్థాలను, తీపి పానీయాలను తినడం సేవించడం వంటి వాటివల్ల డయాబెటిస్ కు దారితీస్తుంది రక్తంలోని చక్కెర స్థాయి లో పెరిగి మధుమేహం వచ్చే అవకాశం ఎక్కువ.ఇక వీటితో పాటు కాఫీ , టీ , ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ తో పాటు కాస్త పాస్తా..పిజ్జా.. బర్గర్.. వంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి.