జుట్టు అధికంగా రాలిపోతోందా..? జుట్టు రాలడానికి కూడా ఎన్నో కారణాలు ఉంటాయి. ముఖ్యంగా మీ జుట్టును అందంగా తీర్చిదిద్దుకోవాలి అంటే కొన్ని జాగ్రత్తలు తెలుసు కోవాల్సిందే.. ఇకపోతే ముఖ్యంగా చాలా మంది చుండ్రు, జుట్టు రాలడం, దురద వంటి ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమస్యలను దూరం చేసుకోవాలంటే కేవలం హోం రెమెడీస్ తోనే సాధ్యమని చెబుతున్నారు సౌందర్యనిపుణులు.. ఇకపోతే జుట్టురాలే సమస్యను దూరం చేసుకోవడానికి ఎ లాంటి హోమ్ రెమెడీస్ ను ట్రై చేయాలో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.ఇందుకోసం ఒక కప్పులో పెరుగు తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల కలోంజీ సీడ్స్ తీసుకోవాలి.
రెండు టేబుల్ స్పూన్ల ఆముదం వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఇంకా బాగా మిక్స్ చేసి జుట్టుకు పట్టించాలి. ఒక 30 నిమిషాలు ఆగిన తర్వాత రెగ్యులర్ గా ఉపయోగించే షాంపూతో తలస్నానం చేయాలి. వారానికి రెండు సార్లు ఈ చిట్కాలను పాటించడం వల్ల చుండ్రు, జుట్టు రాలే సమస్య, జుట్టు నిర్జీవంగా మారడం వంటి సమస్యలు అన్ని దూరం అవుతాయి.ఇక ఆముదం నూనె ను పూర్వం నుండి మన పెద్దలు ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే.. ఆముదం నూనెను తలకు పట్టించడం వల్ల తలకు చల్లదనాన్ని ఇవ్వడమే కాకుండా జుట్టురాలే సమస్యను కూడా అరికడుతుంది అని.

. మన పెద్దలు ఆముదం ను ఎక్కువగా ఉపయోగించేవారు. అంతేకాదు జుట్టు రాలడాన్ని తగ్గించడంలో సహాయ పడటమే కాకుండా జుట్టు నల్లగా మారడానికి కూడా ఆముదం చాలా చక్కగా పనిచేస్తుంది.ఈ చిట్కా లో మనం ఉపయోగించే పెరుగు వల్ల జుట్టు కుదుళ్లు బలంగా మారడమే కాకుండా జుట్టుకు కావల్సిన తేమను కూడా అందిస్తుంది. ఇక పెరుగుతో ఇవే కాదు ఎన్నో లాభాలు కూడా ఉన్నాయి. కలోంజీ సీడ్స్ కూడా జుట్టుకు చల్లదనాన్ని ఇవ్వడంతోపాటు కుదుళ్లు దృఢంగా పెరగడానికి సహాయపడుతాయి.