ముఖంపై ముడతలు ఎక్కువగా కనిపిస్తున్నాయా..?

సాధారణంగా ఇటీవల కాలంలో చాలా మందికి కొన్ని కారణాల వల్ల ముఖం మీద ముడతలు వచ్చి అందవిహీనంగా.. వయసుపైబడిన వారిలా గా కనిపిస్తూ ఉన్నారు. ఇకపోతే పోషకాల లోపం.. ఎండా.. కాలుష్యం.. దుమ్ము.. నీటి కలుషితం.. తినే ఆహారం కలుషితం ఇలా రకరకాల కాలుష్యాల కారణంగా చిన్న వయసులోనే చర్మం ముడతలు పడి పోవడం వంటివి జరుగుతున్నాయి. ఇక అమ్మాయిలు చర్మాన్ని బిగుతుగా చేసుకోవడానికి మార్కెట్లో లభ్యమయ్యే ఎన్నో రకాల ఉత్పత్తులను ఉపయోగిస్తున్నప్పటికీ ఫలితం లేకుండా పోతోంది. కానీ సరైన చిట్కా ఏంటో తెలియక వారు ఎన్నో ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం.ముఖం పై ముడతలు రావడానికి గల కారణం

మద్యపానం, ధూమపానం , బరువు తగ్గడం వంటి సమస్యలు కూడా కారణం కావచ్చు అని వైద్యులు చెబుతున్నారు. ఇకపోతే ఈ ముడతల్ని తగ్గించుకోవాలంటే ముందుగా మీరు ఒక కప్పు తీసుకొని అందులో నాలుగు టేబుల్ స్పూన్ల ఎర్ర కందిపప్పు వేసి , మునిగే వరకు నీళ్ళు పోసి సుమారుగా నాలుగు గంటలపాటు నానబెట్టాలి. నీళ్లు తీసేసి ఎర్ర కందిపప్పు ను మిక్సీ జార్ లో వేసి మెత్తని పేస్ట్ లా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి.ఇందులో 2 టేబుల్ స్పూన్ ల అలోవెర జెల్‌.. రెండు టేబుల్ స్పూన్ల ఎర్ర కందిపప్పు పేస్ట్..ఒక టేబుల్ స్పూన్ గ్లిజరిన్‌.. రెండు చుక్కల విటమిన్ ఇ క్యాప్సుల్ ఆయిల్ వేసుకుని కొన్ని నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకుంటే క్రీమ్ సిద్ధమైనట్టే.

Are wrinkles more visible on the face 
Are wrinkles more visible on the face

దీనిని గాలి దూరని ఎయిర్ టైట్ డబ్బాలో వేసి నిల్వ చేసుకోవచ్చు.. ఇక ఈ క్రీమ్ ను ఫ్రిజ్లో నిల్వ చేసుకుంటే సుమారుగా ఇరవై రోజుల పాటు ఉపయోగించుకోవచ్చు .. ఎలా అప్లై చేయాలి అనే విషయానికి వస్తే ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు ముఖానికి మేకప్ తీసివేసి.. శుభ్రంగా నీటితో కడుక్కోవాలి. ముఖానికి ఈ క్రీమ్ అప్లై చేసి నిద్రపోవాలి. ఉదయాన్ని చల్లని నీటితో వాష్ చేసుకోవాలి. ఇలా కొన్ని రోజులపాటు క్రమం తప్పకుండా పాటిస్తే చర్మం బిగుతుగా మారడమే కాకుండా చర్మం పై ఏర్పడిన ముడతలు తొలగిపోయి.. చర్మం అందంగా , తాజాగా తయారవుతుంది.