DRDO Jobs : నిరుద్యోగులకు శుభవార్త..DRDO లో ఉద్యోగాలు భర్తీ..!!

DRDO Jobs ; కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు తాజాగా ఒక శుభవార్త తీసుకువచ్చింది.. బెంగళూరు లోని DRDO గ్యాస్ కార్బన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ లో పలు విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక ఈ పోస్టులకు ఆసక్తిగా ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని తెలియజేస్తోంది.. ఇక ఇందుకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Good news for the unemployed Jobs replacement in DRDO
Good news for the unemployed Jobs replacement in DRDO

1). మొత్తం ఖాళీల సంఖ్య-150 : ఇందులోని మొత్తం ఖాళీలు గ్రాడ్యుయేట్స్ అప్రెంటిస్ ట్రైనీ పోస్టులు 75, డిప్లమా అప్రెంటిస్ ట్రైనీలు-20 పోస్టులు, ఐటిఐ అప్రెంటిస్ ట్రైనీలు-25 పోస్టులు, గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ట్రైనీలు-30 పోస్టులు కలవు.

2). అర్హతల : 1). గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ట్రైనీలు-75 పోస్టులకు అర్హత బిఈ/బీటెక్/తత్సమాన అర్హత ఉండాలి. ఇక స్టైఫండ్ కింద నెలకు రూ.9000 రూపాయలు ఇస్తారు.

2). డిప్లమా అప్రెంటిస్ ట్రైనీలు-20 పోస్టులకు సంబంధించి అర్హతలు.. ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి. స్టైఫండ్ కింద.. నెలకు రూ.8000 రూపాయలు వస్తుంది.

3). ఐటిఐ అప్రెంటిస్ ట్రైనీలు-25 పోస్టులకు సంబంధించి అర్హతలు.. ఇంజనీరింగ్ ఐటిఐ ఉత్తీర్ణత ఉండాలి. నెలకి స్టైఫండ్ కింద రూ. 7000 వరకు జీతం వస్తుంది.

4). గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ట్రైనీలు -30 పోస్టులకు సంబంధించి అభ్యర్థులు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణత అయి ఉండాలి.. నెలకి స్టైఫండ్ కింద రూ.9000 వరకు జీతం వస్తుంది.

3).అభ్యర్థుల వయస్సు : అప్లై చేసుకునే అభ్యర్థుల వయసు అన్ని పోస్టులకు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.

4). ఎంపిక విధానం : అభ్యర్థులు అకాడమిక్ మెరిట్/ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది.

5). ఆసక్తికరమైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తులను అప్లై చేసుకోవాలి.. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ మార్చి 14.. ఇక అభ్యర్థులకు ఏదైనా పూర్తి సమాచారం కోసం అధికారిక వెబ్సైట్ https://www.drdo.gov.in/ లో చేసుకోవచ్చు. అయితే ఇందులో సెలక్ట్ అయిన వారు బెంగళూరులోని ఉద్యోగం చేయవలసి ఉంటుంది. డిఫెన్స్ జాబ్ లో చేరాలనుకునే వారికి ఒక చక్కని అవకాశం.