Money Tips : అధిక వడ్డీ పొందాలనుకునే వారికి ఒక చక్కటి శుభవార్త అని చెప్పవచ్చు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అన్ని పథకాలు లోకెల్లా ఇప్పుడు ప్రవేశపెట్టిన పథకం చాలా భిన్నంగా ఉండటంతో పాటు ఎక్కువ వడ్డీని కూడా అందిస్తోంది. ఈ స్కీం పేరు సుకన్య సమృద్ధి యోజన పథకం. ఈ పథకంలో తక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేసి ఎక్కువ లాభాలను పొందడమే కాకుండా పన్ను మినహాయింపు ఉంటుంది. పైగా రిస్కు కూడా ఉండదు. సుకన్య సమృద్ధి యోజన పథకం కింద ప్రస్తుతం 7.6 శాతం వడ్డీ కూడా లభిస్తోంది.ఇక ఇతర స్మాల్ సేవింగ్ స్కీం లతో పోల్చుకుంటే ఈ పథకం ద్వారా ఎక్కువ వడ్డీ లభిస్తుంది
అని చెప్పవచ్చు. ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీరేట్లు మారుతూ ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీరేట్లను సవరిస్తూ ఉంటుంది అన్న విషయం అందరికీ తెలిసిందే. వడ్డీ రేట్లలో మార్పులు చోటుచేసుకోవచ్చు లేదా అలాగే స్థిరంగా ఉండవచ్చు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సుకన్య సమృద్ధి యోజన పథకంలో డబ్బులు పెట్టడం వల్ల పన్ను మినహాయింపు తో పాటు రిస్కు కూడా ఉండదు పైగా రాబడి కూడా అధికంగా లభిస్తుంది.సెక్షన్ 80సి కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. రూ.1.5 లక్షల వరకు సంవత్సరానికి మీరు పన్ను మినహాయింపు పొందవచ్చు.

ఇక ఈ పథకం లో మీరు కనీసం రోజుకు వంద రూపాయల చొప్పున ఇన్వెస్ట్ చేసినా మెచ్యూరిటీ సమయం ముగిసే సరికి సుమారు 15 లక్షల రూపాయలు మీ చేతికి వస్తాయి. ఇందులో 15 సంవత్సరాల పాటు డబ్బులు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అమ్మాయికి 18 సంవత్సరాలు వచ్చే వరకు ఇందులో డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి. ఇక 21 సంవత్సరాలు వచ్చిన తర్వాత 15 లక్షల రూపాయలను మీరు పొందవచ్చు.