Beauty Tips : ప్రతి ఒక్కరూ ముఖాన్ని అందంగా చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు . అందులో భాగంగానే అందం కోసం హోమ్ రెమెడీస్ తో పాటు మెడికల్ పరంగా కూడా ఎన్నో రకాల క్రీములను ఉపయోగిస్తూ ఉంటారు. కానీ ఫలితం ఉంటుందో లేదో తెలియదు కానీ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇక పోతే లైఫ్ స్టైల్ లో మార్పులు.. వాతావరణంలో కాలుష్యం, ఎండ , దుమ్ము, ధూళి తినే ఆహారంలో పోషకాల లోపం ఇలా కొన్ని కారణాలవల్ల వయసుతో సంబంధం లేకుండా చిన్న వారికి కూడా ముఖం పై మచ్చలు , ముడతలు అనేవి ఎక్కువగా వస్తున్నాయి. కేవలం కొన్ని చిట్కాలను పాటించి ముఖంపై వచ్చే నల్ల మచ్చలు దూరం చేసుకోవచ్చు.ముఖం మీద వచ్చే నల్ల మచ్చలు వల్ల ఎవరైనా సరే అందవిహీనంగా కనిపిస్తారు. అందుకే అలాంటి వారిలో మీరు కూడా ఒకరైతే.. నల్ల మచ్చలు దూరం చేసే కొన్ని చిట్కాలను ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం..

బ్రౌన్ షుగర్ , నిమ్మరసం : బ్రౌన్ షుగర్ లో రెండు చుక్కల నిమ్మరసం అలాగే ఒక టేబుల్ స్పూన్ తేనె వేసి బాగా మిక్స్ చేయాలి. ఇక దీనిని ముఖం మీద అప్లై చేసి వృత్తాకారంలో బాగా మసాజ్ చేయాలి. ఇలా రోజు మార్చి రోజు ఈ పద్ధతిని పాటించడం వల్ల చర్మం మీద ఉన్న రంధ్రాలలో పేరుకుపోయిన దుమ్ము , ధూళిని తొలగించడంతో పాటు నల్ల మచ్చలు దూరం చేయడంలో కూడా గొప్పగా సహాయపడతాయి.
టీట్రీ ఆయిల్ : వారానికి రెండు లేదా మూడు సార్లు ఈ టీ ట్రీ ఆయిల్ ను కొద్దిగా దూదిలో అద్దుకొని మచ్చలున్న చోట అప్లై చేయడం వల్ల ముఖం మీద ఏర్పడిన నల్ల మచ్చలను దూరం చేసుకోవాలి.
కలబంద : ఇది ఒక మంచి మెడిసన్ అని చెప్పవచ్చు. ముఖం మీద ఏర్పడిన నల్ల మచ్చలు దూరం చేయడమే కాకుండా అప్పటికే వచ్చిన ముడతలను, మొటిమలను కూడా దూరం చేయడంలో కలబంద చాలా బాగా పనిచేస్తుంది.