Jobs : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాలు.. ఎలా అప్లై చేయాలంటే..!!

Jobs : ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వరుసగా ఉద్యోగాలను విడుదల చేస్తూ నిరుద్యోగులకు మేలు చేస్తోంది.. ఇప్పుడు తాజాగా ఇంటెలిజెన్స్ బ్యూరో ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్ర హోంశాఖ పరిధిలో పనిచేస్తున్న అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్..(ACIO) పోస్టులను భర్తీ చేయనున్నారు. అయితే ఈ పోస్టులకు దరఖాస్తు ఎలా చేసుకోవాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

1). మొత్తం ఖాళీల సంఖ్య-150 ఇందులో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ-56, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్-94 పోస్ట్ లు కలవు.

2). అర్హతలు : ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బీటెక్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వృత్తి ఘనత సాధించి ఉండాలి. కంప్యూటర్ సైన్స్లో పీజీ కూడా చేసి ఉండాలి. ఇక వీటితో పాటుగా 2020,21,22 లో వ్యాలిడ్ గేట్ స్కోర్ కార్డు కలిగి ఉండాలి.

Good news for the unemployed Jobs in Intelligence Bureau Recruitment
Good news for the unemployed Jobs in Intelligence Bureau Recruitment

3). దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే : ఆసక్తి కలిగిన అభ్యర్థులు .. అర్హులైన అభ్యర్థుల కేవలం ఆన్లైన్ ద్వారానే దరఖాస్తుకు అప్లై చేసుకోవాలి.

4). సెలక్షన్ ప్రాసెస్ : అభ్యర్థులను మొదట గేట్ స్కోరు ఆధారంగా షార్ట్ లిస్టింగ్ చేస్తారు.. ఆ తరువాత ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుందట.

5). దరఖాస్తు ఫీజు : ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల లో.. ఇతరులకు రూ.600 ,SC,ST, మహిళల అభ్యర్థుల రూ.500 రూపాయలను దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

6). దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ : దరఖాస్తు ప్రారంభం తేదీ..16-04-22,
దరఖాస్తు చివరితేది-7-5-2022

7). అభ్యర్థులు ఏదైనా పూర్తి సమాచారం కోసం అధికారిక వెబ్ సైట్ https://www.mha.gov.in/ ను సంప్రదించడం మంచిది. ఈ పోస్టులకు ఖచ్చితమైన అర్హత కలిగి ఉండాలి.

నిరుద్యోగులు అందరికీ అవసరమైన ఈ ఆర్టికల్ ను వాట్సప్ లేదా ఫేస్బుక్ ద్వారా అందరికీ షేర్ చేయండి..